Nitin Gadkari: కార్లలో ఎయిర్ బ్యాగుల విషయమై కేంద్రం కీలక నిర్ణయం.. ట్వీట్ చేసిన మంత్రి..
ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా దేశంలో తయారయ్యే అన్ని కార్లలో కచ్చితంగా ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై మార్కెట్లోకి వచ్చే ప్రతీ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు కేంద్రం తప్పనిసరి చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఏడాది...

ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా దేశంలో తయారయ్యే అన్ని కార్లలో కచ్చితంగా ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై మార్కెట్లోకి వచ్చే ప్రతీ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు కేంద్రం తప్పనిసరి చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే అక్టోబర్ నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు కూడా చేసింది. కానీ తాజాగా ఈ నిర్ణయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
కార్లలో ఆరు ఎయిర్ బ్యాగుల నిబంధనను ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కాకుండా వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. అంటే 2023 అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. ఈ విషయమై కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ‘సరఫరాలో పరిమితులతో ఆటో ఇండస్ట్రీ ఎదుర్కొంటొన్న ఇబ్బందులు, స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రయాణికుల కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను 2023 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా ఎయిర్‌బ్యాగులను అమలు చేయాలి. ప్రయాణికుల భద్రతే ప్రథమ లక్ష్యం’ అని రాసుకొచ్చారు.
Safety of all passengers travelling in motor vehicles irrespective of their cost and variants is the foremost priority.
— Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2022
ఇదిలా ఉంటే దేశీయ కార్ల కంపెనీల్లో చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేసే వాటిలో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. కానీ దేశీయంగా మాత్రం ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. దీంతో ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాహనతయారీ సంస్థలు ప్రజల ప్రాణాలను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ గతంలో వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..