ఈ నెల 8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ

అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు రంగాలకు సడలింపులు ఇవ్వడంతో.. అయా రంగాలు పునఃప్రారంభం అవుతున్నాయి

ఈ నెల 8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 05, 2020 | 10:09 PM

Central Government meeting: అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు రంగాలకు సడలింపులు ఇవ్వడంతో.. అయా రంగాలు పునఃప్రారంభం అవుతున్నాయి. అయితే విద్యా సంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. రానున్న అన్‌లాక్‌లో వీటికి కూడా అనుమతిని ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్ర‌మంలో  సినీ రంగానికి చెందిన ప్రముఖులతో ఈ నెల 8న కేంద్ర హోంశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌ల ప్రారంభంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్లు తెరుచుకునే తేదీ, పాటించాల్సిన నిబంధ‌న‌ల‌పై చ‌ర్చ జరగనున్నట్లు సమాచారం. ఆ తరువాత థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుద‌ల చేసే అవకాశం ఉంది.

కాగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వలన ఐదు నెలలకు పైగానే థియేటర్లు మూతపడ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు బ్రేక్ పడింది. అయితే ఈ మధ్యలో కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల అవ్వగా.. మరికొన్ని మాత్రం థియేటర్ల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

Read More:

సుశాంత్ కేసు: మరొకరిని అరెస్ట్‌ చేసిన ఎన్సీబీ

అనుష్క సాయాన్ని మరవను.. ఇప్పటికీ మొదటి ఫోన్‌ తనకే చేస్తా: తమన్నా

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu