AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free TV: సామాన్యులకు మరో గుడ్ న్యూస్.. ఉచిత రేషన్ మాత్రమే కాదు.. ఇప్పుడు ఫ్రీ టీవీ కూడా.. ఖర్చంతా ప్రభుత్వానిదే..

మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రజలకు రేషన్‌తోపాటు టీవీ ప్రసార మాధ్యమాలను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. DD సెట్-టాప్ బాక్స్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Free TV: సామాన్యులకు మరో గుడ్ న్యూస్.. ఉచిత రేషన్ మాత్రమే కాదు.. ఇప్పుడు ఫ్రీ టీవీ కూడా.. ఖర్చంతా ప్రభుత్వానిదే..
Pm Modi
Sanjay Kasula
|

Updated on: Jan 05, 2023 | 11:55 AM

Share

సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ సౌకర్యాలను కల్పిస్తోంది. ఇళ్లకు ఉచితంగా ఆహార ధాన్యాలు(రేషన్) ఇవ్వడంతో పాటు.. ఇప్పుడు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు మోదీ సర్కార్ ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది.  దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రసారాలను పెంచడానికి సెంట్రల్ స్కీమ్‌కు ఆమోదం తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆల్ ఇండియా రేడియో FM ఛానెల్‌ల కవరేజీని 80 శాతానికి పైగా జనాభాకు విస్తరించాలని, 8 లక్షల డీడీ ఉచిత డిష్ డీటీహెచ్‌ను పంపిణీ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సెట్-టాప్ బాక్స్‌లు అందించాలని నిర్ణయించింది.

వీటిలో గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు సరిహద్దు ప్రాంతాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు రూ.2,539 కోట్లు వెచ్చించాలని మోదీ ప్రభుత్వ మంత్రివర్గంలో నిర్ణయించింది.

దాదాపు 7 లక్షల మంది ఇళ్లలో ఉచితంగా డిష్ టీవీలను అందించాలని ప్లాన్ చేసింది. ఈ పథకం ద్వారా డీటీహెచ్‌ని మరింతగా విస్తరించాలన్నది కేంద్రం ప్లాన్ . దీంతో పాటు డీడీ పాత స్టూడియోలోని పరికరాలు, ఓబీ వ్యాన్‌ను పూర్తిగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతం 28 ప్రాంతీయ వాటితో సహా 36 టీవీ ఛానెల్‌లను నిర్వహిస్తోంది దూరదర్శన్ . సంబంధించిన తయారీ, సేవల ద్వారా పరోక్ష ఉపాధిని సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. డిడి ఫ్రీ డిష్‌ను విస్తరించడం వల్ల డిటిహెచ్ బాక్సుల తయారీలో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని యోచిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!