AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smile Scheme: రేపటితో ముగియనున్న గడువు.. లైట్ తీసుకున్నారో రూ. 5 లక్షలు మిస్ అయినట్లే..!

Smile Scheme: కరోనా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘స్మైల్‌’ పథకానికి దరఖాస్తులు చేసుకునేందుకు..

Smile Scheme: రేపటితో ముగియనున్న గడువు.. లైట్ తీసుకున్నారో రూ. 5 లక్షలు మిస్ అయినట్లే..!
FD Interest Rates
Shiva Prajapati
|

Updated on: Jun 25, 2021 | 11:23 AM

Share

Smile Scheme: కరోనా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘స్మైల్‌’ పథకానికి దరఖాస్తులు చేసుకునేందుకు గడువు రేపటి(శనివారం)తో ముగియనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుండగా.. బాధిత కుటుంబాలు స్మైల్ పథకం కోసం రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, కరోనా కారణంగా కుటుంబ యజమాని, పోషకుడు చనిపోతే అతడి కుటుంబానికి బీసీ కార్పొరేషన్‌ ద్వారా జాతీయ వెనుకబడ్డ తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ఆర్థిక సాయం అందిస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ రూపంలో దేశాన్ని అతలాకుతలం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ దఫా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మొదటి దశలో వృద్ధులపై ప్రభావం చూపిన కరోనా.. రెండవ దశలో కరోనా కారణంగా మధ్య వయస్కులు, కుటుంబ పెద్దలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో దేశంలో అనేక మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. మరెందరో పెద్దదిక్కును కోల్పోయి ధీనావస్థలోకి కూరుకుపోయారు. ఈ నేపథ్యంలోనే కరోనా కారణంగా కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ‘స్మైల్’ పేరుతో.. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని భావించింది.

ఈ పథకంలో భాగంగా కరోనా కారణంగా కుటుంబ యజమాని, కుటుంబ పోషకులు(18-60 సంవత్సరాల మధ్య వయస్కుడు) చనిపోతే అతని కుటుంబానికి బీసీ కార్పొరేషన్ కింద నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. అయితే, ‘స్మైల్’ పథకం కింద సాయం పొందాలంటే బాధితులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తమ తమ జిల్లాల్లోని వెనుకబడ్డ తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ‘స్మైల్’ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన తరువాత కేంద్రం వారికి రూ. 5 లక్షల సాయాన్ని అందజేస్తుంది.

Also read:

Accident: బాప్‌రే.. షాకింగ్ యాక్సీడెంట్.. హైవే రేయింలింగ్‌పై నిలిచిన కారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..