Remdesivir: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ‘రెమ్‌డెసివిర్’ ధరలు భారీగా తగ్గింపు.. వివరాలివే..

Remdesivir: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బాధితుల ప్రాణదాత

Remdesivir: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 'రెమ్‌డెసివిర్' ధరలు భారీగా తగ్గింపు.. వివరాలివే..
Remdesivir
Follow us

|

Updated on: Apr 17, 2021 | 8:29 PM

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బాధితుల ప్రాణదాత అయిన ‘రెమ్‌డెసివిర్’ ఇంజెక్షన్ ధరలను భారీగా తగ్గించింది. సుమారు ఏడు ఫార్మా దిగ్గజ కంపెనీలు ఈ డ్రగ్‌ను తయారు చేస్తుండగా.. దీనిపై రూ. 2 వేల వరకు తగ్గించాయి. ఈ మందును ప్రజలకు మరింత అందుబాటులో తీసుకురావడంలో భాగంగా కేంద్రం ‘ రెమ్‌డెసివిర్’ ధరలపై కేంద్రం నియంత్రణ విధించింది. ఇదిలా ఉంటే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల ఉత్పత్తిని భారీగా పెంచాలంటూ గతంలోనే ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు ఆదేశాలు జరీ చేసిన సంగతి తెలిసిందే.

ఎబోలా వైరస్ చికిత్స నిమిత్తం గిలియడ్ సైన్సెస్(Gilead Sciences) ఈ రెమెడిసివిర్ టీకాను అభివృద్ధి చేయగా.. ఇప్పుడు దీనిని కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారికి తక్కువ మోతాదులో.. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి ఎక్కువ మోతాదు ఈ మందును వాడుతున్నారు. ప్రస్తుతం దేశంలో రెమెడిసివిర్ కొరత ఏర్పడటమే కాకుండా.. బ్లాక్ మార్కెట్‌లో ఈ మందును భారీగా విక్రయిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్రం, నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అధారిటీ ఫార్మా కంపెనీలను కోరగా.. ఆయా కంపెనీలు అందుకు అంగీకరించాయి. కాగా, ఇప్పటికే ‘రెమ్‌డెసివిర్’, ఫార్మా వస్తువుల ఎగుమతిపై కేంద్రం బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.

‘రెమ్‌డెసివిర్’ ఇంజెక్షన్ ధరలు ఇలా ఉన్నాయి..

సంఖ్య కంపెనీ పేరు బ్రాండ్ పేరు పాత ధరలు కొత్త రేటు
1 కాడిలా హెల్త్ కేర్ REMDAC 2800 రూపాయలు 898 రూపాయలు
2 సెంజన్ ఇంటర్నేషనల్ RemWin 3950 రూపాయలు 2450 రూపాయలు
3 రెడ్డీస్ REDYX 5400 రూపాయలు 2700 రూపాయలు
4 సిప్లా CIPREMI 4000 రూపాయలు 3000 రూపాయలు
5 మైలాన్ ఫార్మా DESREM 4800 రూపాయలు 3400 రూపాయలు
6 జుబ్లియెంట్ JUBRI 4700 రూపాయలు 3400 రూపాయలు
7 హెటిరో హెల్త్ కేర్ COVIFOR 5400 రూపాయలు 3490 రూపాయలు

ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..

మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..

కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!