జనగణన ఫస్ట్ ఫేస్ నోటిఫికేషన్ విడుదల.. అధికారులు మీ ఇంటికి వచ్చి అడిగే ఆ 33 ప్రశ్నలు ఇవే..
Census 2027 Notification: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2027 జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈసారి జనాభా లెక్కలు కేవలం మీ ఇంటి నిర్మాణం, మీరు వాడే వస్తువుల నుంచి మీరు తినే తిండి వరకు పూర్తి వివరాలను సేకరించబోతున్నారు. సర్వేయర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు అడిగే ఆ 33 ప్రశ్నలు ఏంటంటే?

దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనాభా లెక్కల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జనాభా లెక్కల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ, మొదటి దశలో ఇండ్ల గణన కోసం అడిగే 33 ప్రశ్నల జాబితాను వెల్లడించింది. డిజిటల్ పద్ధతిలో జరగనున్న ఈ భారీ ప్రక్రియ కోసం యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. తొలి దశలో మీ ఇంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల వివరాలు, వసతులపై దృష్టి సారించనున్నారు.
సర్వేయర్లు అడిగే ప్రశ్నల జాబితా ఇలా ఉంది
ఇంటి నిర్మాణం: ఇంటి గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్‌కు వాడిన పదార్థాలు ఏంటి?
నివాస వివరాలు: ఇంటి సంఖ్య, ఇంటి యాజమాన్య స్థితి, కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, గదుల సంఖ్య.
కుటుంబ పెద్ద వివరాలు: యజమాని పేరు, వారు షెడ్యూల్డ్ లేదా ఇతర వర్గాలకు చెందినవారా అనే సమాచారం.
కనీస వసతులు: తాగునీటి వనరు, నీటి లభ్యత, కరెంటు సౌకర్యం, మరుగుదొడ్డి రకం, డ్రైనేజీ వ్యవస్థ వివరాలు.
వంటగది: వంటకు వాడుతున్న ఇంధనం , వంటగది సౌకర్యం ఉందా లేదా?
డిజిటల్ ఆస్తులు – ఇతర వస్తువుల వివరాలు
- రేడియో- ట్రాన్సిస్టర్, టెలివిజన్.
- ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాప్‌టాప్, కంప్యూటర్.
- మొబైల్ ఫోన్, స్మార్ట్‌ఫోన్ వివరాలు
- సైకిల్, స్కూటర్, కారు లేదా వ్యాన్ వివరాలు.
- ప్రధానంగా వినియోగించే తృణధాన్యాల వివరాలు
ఎంతమందికి ఒక సర్వేయర్?
ఈ బృహత్తర కార్యాన్ని నిర్వహించడానికి భారత రిజిస్ట్రార్ జనరల్ కఠిన నిబంధనలను రూపొందించారు:
సర్వేయర్లు: 1990 జనాభా లెక్కల చట్టం ప్రకారం ఉపాధ్యాయులు, ప్రభుత్వ గుమస్తాలు, స్థానిక అధికారులను ఎన్యూమరేటర్లుగా నియమిస్తారు.
పని భారం: ప్రతి సర్వేయర్‌కు 700 నుండి 800 మంది జనాభాను లెక్కించే బాధ్యత అప్పగిస్తారు.
పర్యవేక్షణ: ప్రతి ఆరుగురు సర్వేయర్లకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. అత్యవసర పరిస్థితుల కోసం 10శాతం అదనపు సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుతారు.
అధికారులు: జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.
రెండవ దశ ఎప్పుడు?
మొదటి దశ గృహ గణన పూర్తయిన తర్వాత, రెండవ దశలో అసలైన జనాభా గణన ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్, నోటిఫికేషన్ తర్వాత విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
