Crime News: క్యాబ్ డ్రైవర్ పై దాడి.. నడి రోడ్డుపై రచ్చ చేసిన యువతిపై పోలీసు కేసు
Lucknow Girl: యూపీ రాజధాని లక్నోలో గత నెల 30 న నడిరోడ్డులో ఓ క్యాబ్ డ్రైవర్ మీద దాడి చేసిన యువతి పై పోలీసు కేసు నమోదయింది. కృష్ణా నగర్ ఏరియాలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Lucknow Girl: యూపీ రాజధాని లక్నోలో గత నెల 30 న నడిరోడ్డులో ఓ క్యాబ్ డ్రైవర్ మీద దాడి చేసిన యువతి పై పోలీసు కేసు నమోదయింది. కృష్ణా నగర్ ఏరియాలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ యువతి ఆ డ్రైవర్ మీద విరుచుక పడుతూ మాటిమాటికీ అతడిని లెంప దెబ్బలు కొట్టింది. మధ్యలో జోక్యం చేసుకోబోతున్న వారిని సమీపించి ఆ డ్రైవర్ ఏదో చెప్పబోతున్నప్పటికీ వెనుక నుంచి అతడి కాలర్ పట్టుకుని లాగి వెనక్కి ఈడ్చుకుని వచ్చి వీరంగం సృష్టించింది. యితడు తన వాహనాన్ని ఢీ కొట్టాడని, పైగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అతడి సెల్ ఫోన్ ను నేలకీసి కొట్టి ధ్వంసం చేసింది. వీరి గొడవను ఆపడానికి యత్నించిన ఓ పోలీసు కానిస్టేబుల్ పట్ల కూడా ఆమె దురుసుగా వ్యవహరించింది.
ఇదంతా సీసీటీవీ లో రికార్డ్ అయింది. దీన్ని పరిశీలనగా చూసిన పోలీసులు అసలు ఇందులో ఆ క్యాబ్ డ్రైవర్ తప్పేమీ లేదని, క్రాసింగ్ వద్దకు చేరుకోగానే అతడు తన కారును ఆపాడని, కానీ ఈ యువతే కాస్త క్రాస్ చేసిందని తెలుసుకున్నారు. పైగా ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ కారులోనుంచి డ్రైవర్ ను బయటికి లాగి ..ఇక అక్కడ అంతా రచ్చ చేసిందని ఖాకీలకు వెల్లడైంది. దాంతో ఆమె మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కాగా ఈ వీడియో చూసిన పలువురు పలు రకాలుగా స్పందించారు. ఆ యువతి ప్రవర్తనను కొందరు తప్పు పడితే ..మరికొందరు.. ఆ డ్రైవర్ వాహనంతో తో బాటు మరికొన్ని వాహనాలు కూడా క్రాసింగ్ దాటాయని పేర్కొన్నారు.
Viral Video: A Girl Continuously Beating a Man (Driver of Car) at Awadh Crossing, Lucknow, UP and allegedly Damaging his Phone inspite of him asking for Reason pic.twitter.com/mMH7BE0wu1
— Megh Updates ? (@MeghUpdates) July 31, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : మాల్దీవుల మాదిరి ఇప్పుడు మన ఇండియాలో కూడా..ఎక్కడ..?ఎప్పుడు ..?అనుకుంటున్నారా..?(వీడియో)Maldives in India video.