Cabinet Reshuffle 2023: కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులకు కసరత్తు.. తెలంగాణ నుంచి మరొకరికి ఛాన్స్?

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులకు కసరత్తు జరుగుతోంది. కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. మిత్రులను మంత్రి మండలిలోకి ఆహ్వానించే ఆలోచనతో పలు శాఖల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Cabinet Reshuffle 2023: కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులకు కసరత్తు.. తెలంగాణ నుంచి మరొకరికి ఛాన్స్?
Pm Modi And Amit Shah

Updated on: Jan 29, 2023 | 4:04 PM

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులకు కసరత్తు జరుగుతోంది. కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. మిత్రులను మంత్రి మండలిలోకి ఆహ్వానించే ఆలోచనతో పలు శాఖల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నాలుగు శాఖల మినహా మిగతా శాఖల్లో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. కొందరు మంత్రులు, సహాయ మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని.. ఇప్పటికే వాళ్లకు పరోక్షంగా సంకేతాలిచ్చినట్టు సమాచారం.

బడ్జెట్ సమావేశాలకు ముందే మార్పులకు అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేబినెట్ విస్తరణలో పెద్దపీట వేయడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ నుంచి అదనపు బెర్త్ ఉత్కంఠ రేపుతోంది.

తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ మంత్రిగా కొనసాగుతుండగా, అసెంబ్లీ ఎన్నికలతో శ్రేణులకు మరింత ఊపునిచ్చేలా రాష్ట్రానికి రెండో బెర్త్ కూడా కేటాయించే అవకాశాలున్నాయి. ఈ మధ్యే రాజ్యసభకు ఎన్నికైన లక్షణ్ ఈ రేసులో ముందున్నారు. ఆదివాసీల పోడు భూముల అంశం కొద్ది నెలలుగా రగులుతోన్న క్రమంలో సీఎం కేసీఆర్ ను మరింత ఇరుకున పెట్టేలా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును కేంద్ర కేబినెట్ లోకి చేర్చుకుంటే ఎలా ఉంటుందని కూడా బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..