Bus Accident: నదిలోపడ్డ బస్సు.. 12 మంది మృతి.. మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మృత దేహాలను వెలికితీశారు. ధార్ జిల్లా ఖాల్‌ఘాట్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ఉన్నట్టు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌లో ఈరోజు ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఇక్కడి ధార్ జిల్లాలో ప్రయాణికులతో కూడిన బస్సు నర్మదా నదిలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతదేహాలను వెలికితీయగా.. ఇప్పటికే 15 మందిని రెస్క్యూ చేశారు అధికారులు. మిగతా వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. బస్సు ఇండోర్ నుంచి పుణె వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై శివరాజ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి నరోత్తమ్ మిశ్రా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. పదిహేను మందిని కాపాడగలిగామని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ మాట్లాడుతూ.. అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ధార్ జిల్లాలోని ఖల్ఘాట్ వద్ద నర్మదా నదిలో ప్రయాణికులతో నిండిన బస్సు పడిపోవడంపై విచారణ వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ వర్క్ చేయడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించే పనిని చేయవచ్చని నేను ప్రభుత్వానికి సూచించినట్లుగా పేర్కొన్నారు.
12 people dead, 15 rescued after a Maharashtra Roadways bus going from Indore to Pune falls off Khalghat Sanjay Setu in Dhar district, says Madhya Pradesh minister Narottam Mishra. pic.twitter.com/h4FuW2B3Ch
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం ఆగ్రా-ముంబై (AB రోడ్) హైవేపై జరిగింది. ఈ రహదారి ఇండోర్‌ను మహారాష్ట్రను కలుపుతుంది. సంఘటన స్థలం ఇండోర్ నుంచి 80 కి.మీ. ఈ బస్సు సంజయ్ సేతు వంతెనపై నుంచి బస్సు నదిలో పడిపోయింది. ఇది రాష్ట్రంలోని రెండు జిల్లాలు, ధార్, ఖర్గోన్ సరిహద్దులో నిర్మించబడింది. దాదాపు సగం భాగం ఖల్ఘాట్ (ధార్)లో, సగం ఖల్తాకా (ఖర్గోన్)లో ఉంది. ఇక్కడ, ఖార్గోన్ నుంచి కలెక్టర్, ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో ఇలా రాసింది. “నేను ఖర్గోన్ కలెక్టర్‌తో మరోసారి ఫోన్‌లో చర్చించాను. రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరణాత్మక సమాచారాన్ని తీసుకున్నాను. రెస్క్యూ ఆపరేషన్‌లో ముఖ్యమంత్రి సచివాలయం కూడా ఖర్గోన్, ధార్, ఇండోర్ జిల్లాల అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లుగా వెల్లడించారు.




