Selfie crime: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రాణం తీసిన సెల్ఫీ.. ఫ్రెండ్స్ తో కలిసి ఫొటో దిగుతుండగా
ప్రస్తుతం అందరి వద్ద సెల్ ఫోన్లు (Cell Phones) ఉన్నాయి. సెల్ ఫోన్ లేనిదే అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది మన బాడీ పార్ట్ లాగా మారిపోయింది. అంతగా మన లైఫ్ స్టైల్ లో కలిసి పోయిన మొబైల్ తో అనేక దుష్పరిణామాలు...
ప్రస్తుతం అందరి వద్ద సెల్ ఫోన్లు (Cell Phones) ఉన్నాయి. సెల్ ఫోన్ లేనిదే అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది మన బాడీ పార్ట్ లాగా మారిపోయింది. అంతగా మన లైఫ్ స్టైల్ లో కలిసి పోయిన మొబైల్ తో అనేక దుష్పరిణామాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించడం లేదు. ముఖ్యంగా యువత క్రేజ్ కు కేరాఫ్ గా మారిన సెల్ఫీలతో పెను ముప్పు పొంచి ఉంటోంది. ఫోన్ లలో ఈ వెసులుబాటు ఉండటంతో స్వీయచిత్రాలపై (Selfie) మనసు పారేసుకుంటున్నారు. ఆ క్రమంలో ప్రమాదాలనూ పట్టించుకోకుండా ప్రాణాలే కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. సరదా సెల్ఫీలు కాస్తా డేంజర్ గా మారుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. స్నేహితులతో కలిసి సెల్ఫీ దిగుతున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోయి చివరికి చనిపోయింది. కాగా ఆమె తిరుపతి వాసి కావడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన కట్టా వినీత.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శని, ఆదివారం వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి ఊటీ విహారయాత్రకు వచ్చారు. ఈ క్రమంలో కల్లాడి నది ఒడ్డుపై సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో వినిత ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వినీత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం రోజంతా గాలించి.. చివరకు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో తిరుపతిలోని వినీత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి