Trending: వాటే ఐడియా సర్ జీ.. హెల్మెట్ ధరించిన బస్ డ్రైవర్.. కారణం తెలిస్తే మీరూ సూపర్ అంటారు..
హెల్మెట్ (Helmet) ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బైక్ పై ప్రయాణిస్తున్నపు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేక పోలీసులు వేసే...
హెల్మెట్ (Helmet) ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బైక్ పై ప్రయాణిస్తున్నపు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేక పోలీసులు వేసే జరిమానా నుంచి తప్పించుకోవటం కోసమో హెల్మెట్‌ను ధరించడం కాకుండా మన భద్రత కోసం, మనపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి. శరీరంలోని అతిముఖ్యమైన అవయవాల్లో తల ఒకటి. దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయి..తలకు బలమైన గాయమైతే.. ఊహించుకోవటానికే కష్టంగా ఉంది కదూ..! కానీ ఇది వాస్తవం.. అందుకే హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. అయితే బైక్ (Bike) లపై ప్రయాణించే వారు హెల్మెట్ ధరించడం తెలిసిందే. కానీ బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించడం మీరెప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూసేయండి.
Picture of UP Roadways bus clicked in Baghpat pic.twitter.com/0hkJAimkfG
ఇవి కూడా చదవండి— Piyush Rai (@Benarasiyaa) July 17, 2022
ఉత్తర ప్రదేశ్ లోని గాజియాబాద్ లో ఓ బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. దీంతో గాయాలబారిన పడకుండా, వర్షం, గాలి నుంచి రక్షణ కోసం డ్రైవర్ హెల్మెట్ ధరించాడు. బాగ్‌పత్ సరిహద్దులో ఈ దృశ్యం కనిపించింది. ప్రమాదం జరిగిన బస్సును డ్రైవర్ అలాగే డిపోకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో బస్సును ఢీకొట్టటం వల్ల ముందు అద్దాలు పగిలిపోయాయని డ్రైవర్ వివరించారు. రోడ్డుపై వెళ్తున్న బస్సును ఓ వ్యక్తి వెంబడించి మరీ ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి