విజయ్ దివస్ గుర్తుగా బీఎస్ఎఫ్ జవాన్లు ఏం చేశారో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సైనికుల వీడియో..

సరిహద్దుల్లో అమరులైన జవానులను స్మరించుకోపోతే మన బ్రతుకుకు అర్థమే లేదు. ఎందుకంటే మనం స్వేచ్ఛగా

విజయ్ దివస్ గుర్తుగా బీఎస్ఎఫ్ జవాన్లు ఏం చేశారో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సైనికుల వీడియో..
Follow us

|

Updated on: Dec 15, 2020 | 11:56 PM

సరిహద్దుల్లో అమరులైన జవానులను స్మరించుకోపోతే మన బ్రతుకుకు అర్థమే లేదు. ఎందుకంటే మనం స్వేచ్ఛగా తిరగడానికి వారు ప్రాణాలను పనంగా పెట్టి పోరాడారు కనుక. తాజాగా 1971 యుద్ద వీరుల గౌరవార్థం బీఎస్ఎఫ్ జవానులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి వారికి ఘనంగా నివాళులర్పించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

1971లో పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా ఏటా ఇండియా డిసెంబర్ 16ను విజయ్ దివస్ పేరుతో వేడుకలు చేస్తోంది. తూర్పు పాకిస్తాన్‌లో మొదలైన ఈ పోరులో భారత్, పాక్‌ను ఓడించింది. దీంతో బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడింది. దీనికి గుర్తుగా విజయ్ దివస్ వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 13,14 అర్ధరాత్రి భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 180 కిలోమీటర్ల పరుగు పందాన్ని నిర్వహించారు. రాజస్థాన్‌లోని బికనేరు నుంచి ప్రారంభమైన ఈ పరుగు అనూప్‌గఢ్‌లో ముగిసింది. 900 మంది బీఎస్ఎఫ్ జవాన్లు ఈ పరుగుపందెంలో పాల్గొన్నారు. ఒక్కో జవాను 400 మీటర్ల నుంచి 800 మీటర్లు పరిగెత్తారు. కేవలం 11 గంటల్లో ఈ పరుగుపందాన్ని పూర్తి చేశారు. దీంతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు జవాన్లను అభినందించారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.