గోవాలో ఆప్ కి కొత్త ఆశాకిరణం హాంజెల్ ఫెర్నాండెజ్ , వయస్సు 26 ఏళ్ళే !

గోవాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆప్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన హాంజెల్ ఫెర్నాండెజ్ ఈ పార్టీకి కొత్త ఆశాకిరణమయ్యాడు. బెనాలిన్ నుంచి పోటీ చేసిన ఈ యువకుడు అనూహ్యంగా విజయం సాధించాడు. అసలు రాజకీయాల్లో..

గోవాలో ఆప్ కి కొత్త ఆశాకిరణం హాంజెల్ ఫెర్నాండెజ్ , వయస్సు 26 ఏళ్ళే !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 15, 2020 | 10:14 PM

గోవాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆప్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన హాంజెల్ ఫెర్నాండెజ్ ఈ పార్టీకి కొత్త ఆశాకిరణమయ్యాడు. బెనాలిన్ నుంచి పోటీ చేసిన ఈ యువకుడు అనూహ్యంగా విజయం సాధించాడు. అసలు రాజకీయాల్లో రావాలనే ఉద్దేశమే ఇతనికి లేదట.. ఓ కార్పెంటర్ కొడుకైన హాంజెల్..తన తండ్రి లాగే కార్పెంటర్ కూడా.. అయితే ఇతని తల్లి తన కుమారుడిని పాలిటిక్స్ లో చేరాల్సిందిగా సూచించింది. ఇక్కడ ఆప్ కి దక్కింది ఒక్క స్థానమే అయినా అదే ఢిల్లీ సీఎం, ఈ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి ఎంతో సంతోషకరమైన వార్త అయింది. ఇది నాంది మాత్రమే అని ఆయన ట్వీట్ చేశారు. 2022 లో గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకూ తాము పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అసలు ఒకే ఒక్క స్థానం గెలిచినా చాలు.. పెద్ద పార్టీలతో పోటీ పడి విజయం సాధించడమే గ్రేట్ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో  బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకున్న సంగతి విదితమే . కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లను దక్కించుకుంది.