PUBG పబ్జీ ఆడనివ్వడం లేదని.. తల్లిని తుపాకీతో కాల్చాడు.. ఆఖరుకు
కిల్లర్ గేమ్స్.. ఆన్లైన్ గేమ్ ఆడుకోనివ్వలేదని 16 ఏళ్ల బాలుడు తన తల్లిని హత్య చేశాడు. లక్నోలో(Lucknow) ఈ ఘటన జరిగింది. మొబైల్లో గేమ్స్‌కు అలవాటు పడిన అతడు తల్లిని తుపాకీతో కాల్చేశాడు. హత్యను కప్పిపుచ్చడానికి....
కిల్లర్ గేమ్స్.. ఆన్లైన్ గేమ్ ఆడుకోనివ్వలేదని 16 ఏళ్ల బాలుడు తన తల్లిని హత్య చేశాడు. లక్నోలో(Lucknow) ఈ ఘటన జరిగింది. మొబైల్లో గేమ్స్‌కు అలవాటు పడిన అతడు తల్లిని తుపాకీతో కాల్చేశాడు. హత్యను కప్పిపుచ్చడానికి పోలీసులకు కట్టు కథలు వినిపించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో నివాసముండే ఓ బాలుడు పబ్జీ ఆటకు బానిసయ్యాడు. అతని ప్రవర్తనను గమనించిన తల్లి.. ఆన్ లైన్ ఆటలు ఆడవద్దని సూచించింది. అంతే కాకుండా అతని నుంచి సెల్ ఫోన్ తీసుకుంది. దీంతో బాలుడికి అతని తల్లికి మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర కోపంతో యువకుడు తల్లిని తుపాకితో కాల్చాడు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కకడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. తల్లిని తానే చంపినట్లు కుమారుడు ఒప్పుకున్నాడని తూర్పు లక్నో ఏడీసీపీ అబిది తెలిపారు. “బాలుడు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడని, అతని తల్లి అతణ్ని ఆడనీయడం లేదని, ఫలితంగా బాలుడు తన తల్లిని చంపినట్లు గుర్తించామని చెప్పారు.
ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రలోని ధానే లో ఇలాంటి ఘటనే జరిగింది. థానే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు పబ్జీ ఆటకు అలవాటు పడ్డారు. ఆట ఆడుకుంటున్న సమయంలో తలెత్తిన గొడవ కారణంగా ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని చనిపోయారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి