Covid-19 4th Wave: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమైందా..? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

భారత్‌లోనూ నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలున్నట్లుగా వస్తున్న ప్రచారంను నిపుణులు కొట్టిపారేశారు. అంతలా హడలిపోవల్సిన అవసరం లేదని అంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటకీ.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు..

Covid-19 4th Wave: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమైందా..? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
Covid 19
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 08, 2022 | 3:15 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే ఫోర్త్‌ వేవ్‌ దేశంలో విజృంభించే అవకాశం ఉందని హెచ్చరికలు మొదలయ్యాయి. కరోనా ఎక్కడికి పోలేదు.. ఇక్కడిక్కడే తిరుగుతోంది. గత 16 రోజులుగా భారతదేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జూన్ 8న యాక్టివ్ ఇన్‌ఫెక్షన్లు పెరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దేశానికి ఫోర్త్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ఆరోగశాఖ. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పాత రోజులు రిపీట్‌ అవుతాయని హెచ్చరించింది. గత కొద్ది వారాలుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. మళ్లీ విజృంభిస్తోంది. చైనా సహా ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలున్నట్లుగా వస్తున్న ప్రచారంను నిపుణులు కొట్టిపారేశారు. అంతలా హడలిపోవల్సిన అవసరం లేదని అంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటకీ.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇది 4వ వేవ్‌కు సంకేతం కాదని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలావుంటే.. తాజాగా భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 5,233 కొత్త కరోనావైరస్ (Coronavirus) కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఏడుగురు మరణించారు. సోమవారంతో పోల్చుకుంటే.. మంగళవారం దాదాపు 40 శాతం కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 1,881 కేసులు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 5 వేల మార్క్ దాటింది. SARS-CoV-2  ఓమిక్రాన్ స్ట్రెయిన్ BA.4 , BA.5 సబ్‌వేరియంట్‌లు దేశంలోకి ప్రవేశించినందున మే మధ్య నుంచి భారతదేశం కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌లలో క్రమంగా పెరుగుదలను చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 28,857కి పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.06 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో మొత్తం 3,345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు దాదాపు 98.72 శాతానికి చేరుకుంది.

సీనియర్ శాస్త్రవేత్త, ఎపిడెమియాలజీ, కమ్యూనికేబుల్ డిసీజెస్ విభాగం అధిపతి, ICMR-నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NARI) డైరెక్టర్ డాక్టర్ సమీరన్ పాండా పలు కీలక వివరాలను అందించారు. ప్రస్తుతం మనం చూస్తున్నది స్థానిక స్థాయి వ్యాప్తి మాత్రమే అని అన్నారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే కోవిడ్ పూర్తిగా పోలేదు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నారు.

మహారాష్ట్ర, కేరళలో..

కాగా.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి భారీ స్థాయిలో పెరుగుతోంది. దేశంలో నమోదైన కొత్త కేసుల్లో ఎక్కువ శాతం ఈ రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. తాజాగా కేరళలో 2,271 కేసులు.. మహారాష్ట్రలో 1881 కేసులు నమోదయ్యాయి.