ఐసిస్ టెర్రరిస్టుకు బెయిల్ మంజూరు సబబే, బాంబే హైకోర్టు సంచలన తీర్పు, ఎన్ఐ కోర్టు అప్పీలుకు తిరస్కృతి

ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న 27 ఏళ్ళ అరీబ్ మజీద్ అనే వ్యక్తికి కింది కోర్టు ఇచ్చిన బెయిల్ సబబేనని బాంబే హైకోర్టు..

ఐసిస్ టెర్రరిస్టుకు బెయిల్ మంజూరు సబబే, బాంబే హైకోర్టు సంచలన తీర్పు, ఎన్ఐ కోర్టు అప్పీలుకు తిరస్కృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2021 | 5:52 PM

ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న 27 ఏళ్ళ అరీబ్ మజీద్ అనే వ్యక్తికి కింది కోర్టు ఇచ్చిన బెయిల్ సబబేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇతనికి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) దాఖలు చేసిన అప్పీలును కోర్టు డిస్పోజ్ చేసింది. న్యాయమూర్తులు ఎస్.ఎస్. షిండే, మనీష్ పిఠాలేలతో కూడిన బెంచ్ ఈ తీర్పు నిచ్చింది. గత ఏడాది మార్చి లో మజీద్ కి స్పెషల్ ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇతని విచారణ చాలా స్లోగా జరిగిందని, ఇతనిపై ప్రాథమిక సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. బాంబేహైకోర్టు ఇతనికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ పోలీసులు ప్రాథమిక సాక్ష్యాధారాలను నిరూపించలేకపోయారన్న ఎన్ ఐ ఏ కోర్టు అభిప్రాయం చాలా లోపాలతో కూడుకుని ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇప్పటికే ఆరేళ్లుగా మజీద్ పోలీసు కస్టడీలో ఉన్నాడని, 50 మంది సాక్షులను విచారించడానికి ఐదేళ్లకు పైగా పట్టిందని న్యాయమూర్తులు అన్నారు. మజీద్ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చాడు..ఇతడు ఐసిస్ పేరిట హానికర చర్యలకు పాల్పడ్డాడనడానికి తగిన కారణాలు కనిపించడం లేదు అని బెంచ్ పేర్కొంది. లక్ష రూపాయల పూచీకత్తుపై కోర్టు ఇతనికి బెయిల్ ఇచ్చింది. 2014 లో మజీద్ ని పోలీసులు అరెస్టు చేశారు. సిరియాకు వెళ్లి అక్కడ ఐసిస్ తో లింక్ ఏర్పరుచుకున్నాడని, భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడమే అతని ఉద్దేశమని పోలీసులు ఆరోపించారు. అయితే సిరియాకు తాను వెళ్ళింది నిజమేనని, కానీ అక్కడ బాధితులకు సాయం చేసేందుకే వెళ్లానని మజీద్ అంటున్నాడు.

Also Read:

పెచ్చులూడిన తెలంగాణ అసెంబ్లీ ఎలివేషన్.. భవనం పటిష్టంగానే ఉందన్న కార్యదర్శి నర్సింహాచార్యులు

Bodhan Passport Case: బోధన్‌ పాస్‌పోర్ట్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్‌

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!