ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. నాగ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్!
మరో విమానానికి ముప్పు తప్పింది. కొచ్చి నుండి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం మంగళవారం(జూేన్ 17) నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన ఫైలట్ నాగ్‌పూర్‌కు తరలించారు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరించి, విమానాన్ని క్షుణ్ణంగా తనికీ చేశారు.

మరో విమానానికి ముప్పు తప్పింది. కొచ్చి నుండి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం మంగళవారం(జూేన్ 17) నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన ఫైలట్ నాగ్‌పూర్‌కు తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో బాంబు అమర్చారనే బెదిరింపు ఎయిర్‌లైన్ అధికారులకు అందింది. ప్రామాణిక ప్రోటోకాల్‌ను అనుసరించి, విమానాన్ని దారి మళ్లించారు ఫైలట్. నాగ్‌పూర్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, బాంబు లేదని నిర్ధారించారు.
#WATCH | An IndiGo flight 6E 2706 from Muscat – Kochi – Delhi made an emergency landing at Nagpur airport after a bomb threat was received. All passengers have been deboarded, investigation is underway, nothing suspicious has been found so far.
Visuals from Nagpur airport in… https://t.co/QQax2PkdN2 pic.twitter.com/ANzfaJzm2U
— ANI (@ANI) June 17, 2025
“మస్కట్-కొచ్చి-ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానం 6E 2706 బాంబు బెదిరింపు రావడంతో నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులందరినీ దించేశారు. దర్యాప్తు జరుగుతోంది, ఇంకా అనుమానాస్పదంగా గుర్తించలేదు” అని నాగ్‌పూర్ డీసీపీ లోహిత్ మతాని తెలిపారు.
An IndiGo flight 6E 2706 from Muscat – Kochi – Delhi made an emergency landing at Nagpur airport after a bomb threat was received. All passengers have been deboarded, investigation is underway, nothing suspicious has been found so far: Lohit Matani, DCP Nagpur
— ANI (@ANI) June 17, 2025
బాంబు గుర్తింపు, మరియు నిర్వీర్య దళం (BDDS) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించారు. విమానాశ్రయ భద్రత, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF), స్థానిక పోలీసులు ప్రస్తుతం అఅప్రమత్తతతో ఉన్నారు. అసలు బాంబు బెదిరింపులకు పాల్పడింది ఎవరనే దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




