Bomb Threat: దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు..
మన దేశంలో ఈమధ్య బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది. మొన్నటి వరకూ ప్రముఖులకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈసారి విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబు దాడులకు పాల్పడుతామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు.

మన దేశంలో ఈమధ్య బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది. మొన్నటి వరకూ ప్రముఖులకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈసారి విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబు దాడులకు పాల్పడుతామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలైన ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, ఆహ్మదాబాద్ విమానాశ్రయాలను టార్గెట్గా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ బ్లాక్ మెయిలింగ్ సందేశాన్ని సంబంధిత ఎయిర్ పోర్టు అధారిటీకి ఈమెయిల్ ద్వారా పంపించినట్లు వెల్లడించారు అధికారులు. బుధవారం రాత్రి 10.23 గంటలకు ఈ బాంబు బెదిరింపులకు సంబంధించిన మెయిల్ వచ్చినట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. డాగ్ స్వాడ్, బాంబ్ స్వాడ్ తో పాటు ఇతర పోలీసు బలగాలు బృందాలుగా మారి శోధించారు. ఎయిర్ పోర్టుల్లో పేలుడు పదార్థాలను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే ఎలాంటి మందు బాంబులు, పేలుడు సామాగ్రి లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలాగే మెయిల్ వచ్చిన ఐడీని ట్రేస్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు.
పార్లమెంట్లో నిండు సభ జరుగుతున్న సమయంలో దుండగులు పొగ బాంబులు ప్రయోగించడం కలకలం రేగింది. ఆ తరువాత బళ్లారి, కేరళ, ముంబాయి పలు రాష్ట్రాల్లో ఉగ్రమూకలు పాగా వేశారన్న సమాచారంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పలు బృందాలుగా మారి ఉగ్రమూకలను అదుపులోకి తీసుకున్నాయి. అలాగే గత వారం రోజుల క్రితం ముంబాయిలోని పలు ప్రైవేటు బ్యాంకులకు, ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంటిపై బాంబు దాడులు జరుగుతాయని హెచ్చరికలు రావడం ఇవన్నీ దేశ ప్రజల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు ప్రత్యేక బృందాలుగా మారి దేశంలోని తాజా పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. నూతన సంవత్సరం వేళ ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








