Vijayakanth: సీనియర్ హీరో, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ మృతి.. ఆసుపత్రి వద్ద పోలీసు భద్రత పెంపు..
గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చెన్నైలోని మియాత్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. విజయకాంత్ లేకపోవడంతో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కొద్దిరోజులుగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న
తమిళ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చెన్నైలోని మియాత్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. విజయకాంత్ లేకపోవడంతో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కొద్దిరోజులుగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు దగ్గు, జ్వరం, జలుబు రావడంతో గత నెల 18న చెన్నై గిండి సమీపంలోని మణపాక్ లోని మియాట్ ఆసుపత్రిలో చేరారు. ఈనెల 12న ఆయనను డిశ్చార్జీ చేశారు.
కొద్దిరోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురికావడంతో మంగళవారం మియాత్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. వైద్య పరీక్షల్లో విజయకాంత్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ చికిత్స అందించారు. కాసేపటి క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గురువారం ఉదయం విజయ్‌కాంత్ కన్నుముశారు.
విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. అసలు పేరు విజయరాజ్ అలకరస్వామి. MA కాజా దర్శకత్వంలో 1979లో విడుదలైన ఇనికి ఇలమై సినిమాతో తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన ఎక్కువగా SA చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో నటించారు. 1980లలో విజయకాంత్ యాక్షన్ హీరో స్థాయికి ఎదిగారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ ఇప్పటికీ తమిళ క్లాసిక్‌గా గుర్తింపు పొందారు. ఈ సినిమాతో అభిమానులు అతన్ని కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం 154 సినిమాల్లో నటించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం విరుదగిరి. 2010లో విడుదలైన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు విజయ్‌కాంత్. అలాగే ఆయన కుమారుడు షణ్ముఖ పాండియన్ నటించిన సాగపథం సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు.
Actor and DMDK Chief Captain Vijayakanth passes away at a hospital in Chennai, Tamil Nadu.
He was on ventilatory support after testing positive for COVID-19. pic.twitter.com/LcT76Uawef
— ANI (@ANI) December 28, 2023
విజయ్‌కాంత్ 1994లో ఎంజీఆర్ అవార్డు, 2001లో కలైమామణి అవార్డు, బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు, 2009లో టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు, 2011లో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.