AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: నాకు ఇష్టమైన నటుడిని కలిశాను.. వైరలవుతున్న ఎన్టీఆర్ ఫోటోస్..

దేవర సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 షూటింగ్ కోసం కొద్ది రోజులుగా ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ స్టార్స్ పార్టీలలోనూ తారక్ సందడి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తారక్ ముంబై ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ సంతోషిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ను కలుసుకున్నాడు ఎన్టీఆర్.

Jr.NTR: నాకు ఇష్టమైన నటుడిని కలిశాను.. వైరలవుతున్న ఎన్టీఆర్ ఫోటోస్..
Jr NTR
Rajitha Chanti
|

Updated on: May 01, 2024 | 10:54 AM

Share

దేవర సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 షూటింగ్ కోసం కొద్ది రోజులుగా ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ స్టార్స్ పార్టీలలోనూ తారక్ సందడి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తారక్ ముంబై ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ సంతోషిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ను కలుసుకున్నాడు ఎన్టీఆర్. వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తారక్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తనకు ఎన్టీఆర్ అంటే ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చారు. “నా ఫేవరేట్ పర్సన్. యాక్టర్ ఎన్టీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని వర్క్ నాచాల ఇష్టం. అతను జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలి” అంటూ రాసుకొచ్చారు. దీంతో వీరిద్దరి ఫోటోస్ చూసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

అనుపమ్ ఖేర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవలే తెలుగులో కార్తీకేయ 2తో మరో హిట్ అందుకున్నారు. ఇందులో శ్రీకృష్ణుడి గురించి చెప్పే సన్నివేశంలో కనిపించి అద్భుతమైన నటనతో గూస్ బంప్స్ తెప్పించారు. ప్రస్తుతం హిందీలో పలు చిత్రాల్లో నటించారు. ఆయన సహజ నటనకు గానూ పద్మ శ్రీ, పద్మ భూషణ్ లాంటి గౌరవ పతకాలను.. ఎన్నో అవార్డులను అందుకున్నారు.

ఇదిలా ఉంటే.. తారక్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ యూనివర్స్ లో ఎన్టీఆర్ కూడా భాగమవడంతో ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఇందులో తారక్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల భార్య ప్రణతితో కలిసి హృతిక్, రణబీర్ కపూర్, అలియా భట్ పార్టీకి హాజరయ్యారు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.