Uttar Pradesh: ఎక్స్ ప్రెస్ వే పక్కన రెడ్ కలర్ సూట్ కేసు.. ఓపెన్ చూసి చూడగా మైండ్ బ్లాంక్..

అది నిత్యం రద్దీగా ఉండే ఎక్స్ ప్రెస్ వే.. వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఆ రహదారికి కూతవేటు దూరంలో జరిగి ఓ ఇన్సిడెంట్ సంచలనంగా మారింది. రెడ్ కలర్ సూట్ కేసులో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు..

Uttar Pradesh: ఎక్స్ ప్రెస్ వే పక్కన రెడ్ కలర్ సూట్ కేసు.. ఓపెన్ చూసి చూడగా మైండ్ బ్లాంక్..
Red Color Suit Case
Follow us

|

Updated on: Nov 19, 2022 | 9:01 AM

అది నిత్యం రద్దీగా ఉండే ఎక్స్ ప్రెస్ వే.. వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఆ రహదారికి కూతవేటు దూరంలో జరిగి ఓ ఇన్సిడెంట్ సంచలనంగా మారింది. రెడ్ కలర్ సూట్ కేసులో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఆమె ఎవరూ అనే విషయాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ మథురలోని థానా రాయ ప్రాంతంలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో యువతి మృతదేహం లభ్యమైంది. రెడ్ కలర్ బ్యాగ్ లో ఉన్న డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే బాధితురాలు ఎవరనేది ఇంకా నిర్థారణ కాలేదు. అయితే యువతి శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు గుర్తు తెలియని కేసుగా నమోదు చేసుకున్నారు. మృతురాలి వయస్సు 21-22 మధ్య ఉంటుందని రాయ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఓంహారీ వాజ్‌పేయి తెలిపారు.

రాయ పట్టణంలోని మథుర రహదారిలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే వ్యవసాయ పరిశోధనా కేంద్రం సమీపంలో రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్‌లో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. ఇది స్థానికంగా సంచలనంగా మారింది. సూట్‌కేస్‌లో మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందిన వెంటనే రాయ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి ఛాతీలో తుపాకీతో కాల్చి చంపిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. శరీరంపై చాలా చోట్ల గాయాల గుర్తులు కనిపించాయి. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు కూడా యువతి ఫొటోను పంపించారు. బాలికను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి ఇక్కడే పడేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

బాలికను గుర్తించేందుకు, హంతకులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను నియమించినట్లు ఎస్పీ దేహత్ త్రిగుణ్ బిసెన్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు అమ్మాయిని మృతురాలు ఎవరనే విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు జిల్లాతో పాటు పక్క జిల్లాల్లోని పోలీసు స్టేషన్లలో ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి