చేసేది మోడలింగ్ బిజినెస్.. ఫాంహౌస్ లో తీసేది బ్లూఫిల్మ్స్

వెండి, బుల్లి తెరల మీద తమ ప్రతిభను చాటుకోవాలని చూస్తోన్న అమ్మాయిలే ఆ కంత్రీగాళ్ల టార్గెట్. ఇందుకోసం మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన బ్రిజేంద్ర గుర్జార్, అంకిత్ చావ్డా మోడలింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు.

  • Anil kumar poka
  • Publish Date - 1:00 pm, Thu, 27 August 20
చేసేది మోడలింగ్ బిజినెస్.. ఫాంహౌస్ లో తీసేది బ్లూఫిల్మ్స్

వెండి, బుల్లి తెరల మీద తమ ప్రతిభను చాటుకోవాలని చూస్తోన్న అమ్మాయిలే ఆ కంత్రీగాళ్ల టార్గెట్. ఇందుకోసం మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన బ్రిజేంద్ర గుర్జార్, అంకిత్ చావ్డా మోడలింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు. అవకాశాల కోసం వచ్చిన అందమైన అమ్మాయిలను ఆకర్షిస్తున్నారు. వీరితో అగ్రిమెంట్లు రాయించుకొని ఫాంహౌస్‌కు తీసుకెళ్లి అనేక రకాలుగా బెదిరించి బ్లూ ఫిలిమ్స్‌లో నటింపజేస్తున్నారు. ఆ వీడియోలను పోర్న్ వెబ్‌సైట్లతో అప్‌లోడ్ చేసి డబ్బు చేసుకుంటున్నారు. విషయం బయటకు చెబితే తమ పరువు ఎక్కడ గంగలో కలుస్తుందోనని కొందరు బాధితులు మౌనంగానే ఉండిపోవడంతో ఈ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పక్కా సమాచారంతో ఈ ముఠాను మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్ నగరంలో ఉన్న సదరు ఫాంహౌస్‌లో తనిఖీలు చేపట్టి గ్వాలియర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీపక్ సోనీ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు జరుగుతుండగా, ఈ ముఠా తీసిన వీడియోలను పాకిస్థాన్‌కు చెందిన హుసేన్ అలీ అనే వ్యక్తి 22 దేశాలకు చెందిన పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నాడని పోలీసులు నిగ్గుతేల్చారు.