మీ రిపోర్ట్ కాపీలను ప్రధానికి పంపండి, రిజర్వ్ బ్యాంకుకు చిదంబరం సూచన
రిజర్వ్ బ్యాంకు వార్షిక నివేదిక తాలూకు కాపీలను ప్రధానికి, కేంద్ర కేబినెట్ లోని ప్రతి మంత్రికీ పంపాలని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ఈ బ్యాంకుకు సూచించారు.

రిజర్వ్ బ్యాంకు వార్షిక నివేదిక తాలూకు కాపీలను ప్రధానికి, కేంద్ర కేబినెట్ లోని ప్రతి మంత్రికీ పంపాలని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ఈ బ్యాంకుకు సూచించారు. కేంద్రానికి ఎంతో విధేయంగా ఉన్న ఓ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎక్కడా చూడలేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ రిపోర్టు కాపీలను పెద్ద సంఖ్యలో ముద్రించి ఇంగ్లీషు లోను, హిందీలోనూ పంపాలని ఆయన కోరారు. అసలు ఆర్ధిక మంత్రి, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ‘గవర్నర్ గారూ ! నా సానుభూతి మీకే! మీరు నిద్ర పోతున్న వ్యక్తిని మేల్కొల్పగలరు గానీ, నిద్ర పోతున్నట్టు నటిస్తున్న వ్యక్తిని మేల్కొల్పగలరా ‘ అని ఆయన పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు .
ఆర్ బీ ఐ ఇటీవల తన నివేదికలో దేశ ఆర్ధిక వ్యవస్థ చాలా దయనీయంగా ఉందని, కరోనా వైరస్ పరిస్థితి కారణంగా కంసంప్షన్ డిమాండ్ తగ్గుతోందని , పెట్టుబడులు తగినంతగా రావడంలేదని, అందువల్ల ఎకానమీ మళ్ళీ గాడిన పడాలంటే సమగ్ర సంస్కరణలు అవసరమని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ..’నేను అప్పుడే చెప్పానుగా’..ఇలాంటి పరిస్థితి వస్తుందని..’ అంటూ ట్వీట్ చేశారు.