ఆక్రమణలను నిరోధించలేని అధికారులను తప్పించాల్సిందే: సుప్రీంకోర్టు
అధికార దుర్వినియోగం, విధి నిర్వహణ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవని అధికారులను విధుల నుంచి తప్పించాలని తెలిపింది. ప్రభుత్వానికి చెందిన విలువైన భూమి ఆక్రమణలను నిరోధించలేని అధికారులపై వేటు వేయాల్సిందేనని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.

అధికార దుర్వినియోగం, విధి నిర్వహణ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవని అధికారులను విధుల నుంచి తప్పించాలని తెలిపింది. ప్రభుత్వానికి చెందిన విలువైన భూమి ఆక్రమణలను నిరోధించలేని అధికారులపై వేటు వేయాల్సిందేనని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. వారిని సర్వీసు నుంచి తొలగించాలని కోర్టు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ ప్రాంతంలో దాదాపు 9.27 ఎకరాల ప్రభుత్వ భూమి సుదీర్ఘకాలం ఆక్రమణకు గురైనట్లు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినవారిని సహించకూడదని, కనీసం కొంతమంది అధికారులపైన అయినా వేటువేయాలని బెంచ్ పేర్కొంది. అంతేకాక సంబంధిత అఽధికారులపై ఏ చర్య తీసుకున్నారో కౌంటర్ అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది.