AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృత్యువుకే పేరుంటే.. అది పారాక్వాట్.. పచ్చని పల్లెల్లో పచ్చగడ్డి మరణ మృదంగం!

కలుపు మొక్కలను వేర్లతో సహా నివారించగలిగిన విషానికి.. మనిషి చంపడం ఒక లెక్కా..! జీవితంపై విరక్తి పుట్టి క్షణికావేశానికి లోనవుతున్న వారిని సునాయసంగా మృత్యువు ఒడికి చేరుస్తోంది ఈ పారాక్వాట్ గడ్డిమందు. 'అదృష్టం కొద్దీ బతికాడు' అని చెప్పుకోడానికి కూడా లేదు ఇది తాగిన వాళ్లు.

మృత్యువుకే పేరుంటే.. అది పారాక్వాట్.. పచ్చని పల్లెల్లో పచ్చగడ్డి మరణ మృదంగం!
Ban Paraquat
Shaik Madar Saheb
|

Updated on: Feb 24, 2026 | 9:45 PM

Share

కలుపు మొక్కలను వేర్లతో సహా నివారించగలిగిన విషానికి.. మనిషి చంపడం ఒక లెక్కా..! జీవితంపై విరక్తి పుట్టి క్షణికావేశానికి లోనవుతున్న వారిని సునాయసంగా మృత్యువు ఒడికి చేరుస్తోంది ఈ పారాక్వాట్ గడ్డిమందు. ‘అదృష్టం కొద్దీ బతికాడు’ అని చెప్పుకోడానికి కూడా లేదు ఇది తాగిన వాళ్లు. గడ్డి మందు తాగి బతికిన కొద్ది మంది ఏదో ఒక అవయమాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వాళ్లు కూడా ఎక్కువ కాలం జీవించే పరిస్థితి ఉండదు. అందుకే, ఇలాంటి విషాన్ని నిషేధించాలని కరీంనగర్‌కు చెందిన డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి కొన్నేళ్లుగా అవగాహన సదస్సులు పెట్టి పోరాటం చేస్తున్నారు. W.H.O.కి ‘ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌’ కూడా ఎప్పుడో స్టేట్‌మెంట్ ఇచ్చింది. మన పార్లమెంట్‌లో సైతం కొందరు ఎంపీలు ఈ పారాక్వాట్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడ్డిపై పారాక్వాట్ చల్లి.. అలా చూస్తూ ఉండండి. గంటల్లోనే ఆ గడ్డిని మాడ్చేస్తుందా మందు. రైతులకు బాగా తెలుసు దాని పవర్ ఏంటో. అలాంటి గడ్డి మందును మనిషి తాగితే? మొక్కలు మాడినట్టే ముందుగా పెదాలు కాలిపోతాయి. నోటి నుంచి గొంతు లోపలి దాకా కాలిన గాయాల్లా పుండ్లు పడతాయి. వాంతులు, విరేచనాలు. ఆ వెంటనే కామెర్లు. కాలేయం పనిచేయకుండా పోతుంది. మెయిన్‌గా స్పాంజ్‌లా ఉండే ఊపిరితిత్తులు గట్టిపడి రాయిలా మారుతాయి. అప్పుడిక ఆక్సీజన్‌ను తీసుకోలేదు. అలాంటి వాళ్లని వెంటిలేటర్‌పై పెట్టినా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!
ఆర్నెళ్లుగా చుక్క మందు ముట్టుకోని స్టార్ స్పిన్నర్
ఆర్నెళ్లుగా చుక్క మందు ముట్టుకోని స్టార్ స్పిన్నర్
పంజాబ్ కింగ్స్ X ఫ్యాక్టర్స్ .. తొలి టైటిల్ తెచ్చే మొనగాళ్లు
పంజాబ్ కింగ్స్ X ఫ్యాక్టర్స్ .. తొలి టైటిల్ తెచ్చే మొనగాళ్లు
ఉగాది రోజున బంగారం కొనుగోలుచేసేవారికి ఊరట.. కుప్పకూలిన ధరలు..
ఉగాది రోజున బంగారం కొనుగోలుచేసేవారికి ఊరట.. కుప్పకూలిన ధరలు..
రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్!
రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్!
ఇంతటితో ఆగను.. సిద్ధార్థ్ గురించి ప్రత్యూష తల్లి ఏమంటున్నారు?
ఇంతటితో ఆగను.. సిద్ధార్థ్ గురించి ప్రత్యూష తల్లి ఏమంటున్నారు?
అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..
అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..
కట్టలు కట్టలుగా పాములు.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..!
కట్టలు కట్టలుగా పాములు.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..!
రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్
రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్
ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్
ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్