బరువు తగ్గాలనుకుంటున్నారా? తమన్నా ఫిట్‌నెస్ ట్రైనర్ చెబుతున్న దీనిని తక్షణం మానేయండి!
అనారోగ్యానికి ముఖ్య కారణం బరువు పెరగడం. కారణ లేకుండా తక్కువ తింటున్నా బరువు పెరుగుతూనే ఉంటారు కొందరు. బరువు తగ్గాలని కంకణం కట్టుకున్నారా? జిమ్‌లో గంటల తరబడి చెమటలు చిందిస్తున్నారా? అయితే మీరు ఎంత కష్టపడినా సరే, కేవలం ఒకే ఒక్క పదార్థం మీ ప్రయత్నాలన్నింటినీ నీరుగారుస్తుంది.

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వంటి స్టార్ హీరోయిన్లకు శిక్షణ ఇచ్చే ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్, బరువు తగ్గాలనుకునే వారు తమ జీవితం నుండి తక్షణమే తొలగించాల్సిన ఆ ‘నెంబర్ వన్’ శత్రువు గురించి హెచ్చరించారు.
ఆమె వెండితెరపై మెరిసిపోవడానికి, ఆమె ఫిట్‌నెస్‌కు కారణం ఆయనే. సెలబ్రిటీల శరీర ఆకృతిని మార్చడంలో సిద్ధార్థ సింగ్ దిట్ట. కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఆహార నియమాల విషయంలోనూ ఆయన ఎంతో కఠినంగా ఉంటారు. తాజాగా ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, మనకు ఎంతో ఇష్టమైన ఒక స్నాక్ ఐటెమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం ఎంతో ఇష్టంగా తినే ఆ పదార్థం ఒక ‘ఆయిల్ స్పాంజి’ అని, దానిని మీ డైట్ నుండి తొలగించకపోతే బరువు తగ్గడం అసాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. ఆ పదార్థం మరేదో కాదు.. అందరూ అమితంగా ఇష్టపడే ‘ఫ్రెంచ్ ఫ్రైస్’.
నూనెను పీల్చే స్పాంజి..
ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం గురించి సిద్ధార్థ సింగ్ మాట్లాడుతూ, వీటిని కేవలం బంగాళదుంప ముక్కలుగా చూడకూడదని అన్నారు. “ఇవి ఒక స్పాంజి లాంటివి. వీటిని నూనెలో వేయించినప్పుడు అవి నూనె మొత్తాన్ని లోపలికి పీల్చుకుంటాయి. మీరు వాటిని తింటున్నప్పుడు, ఆ నూనె అంతా నేరుగా మీ శరీరంలోకి చేరుతుంది” అని ఆయన వివరించారు. దీనివల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు సున్నా కాగా, అనవసరమైన కొవ్వు మాత్రం భారీగా చేరుతుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్ కు ఉన్న ఒక విచిత్రమైన లక్షణం ‘హైపర్-పాలటబుల్’. అంటే, దీనిని ఒక్కటి తింటే ఆపడం అసాధ్యం. మీరు ఒక్క ఫ్రై తిన్నారంటే, తెలియకుండానే మరో 50 తినేలా ఇది మీ మెదడును ప్రేరేపిస్తుంది. దీనివల్ల మీ క్యాలరీల లెక్క ఒక్కసారిగా పెరిగిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను ఇది ‘రోలర్ కోస్టర్’ లాగా మారుస్తుందని ఆయన హెచ్చరించారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న పది నిమిషాలకే మళ్లీ ఆకలి వేయడం దీనికి ప్రధాన సంకేతం.
మెటబాలిజంపై దెబ్బ..
అధిక కొవ్వు, అధిక పిండి పదార్థాలు ఉండే ఈ ఆహారం మెటబాలిక్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. బరువు తగ్గడం అనేది కేవలం తక్కువ తినడం కాదు, సరైనది తినడం అని సిద్ధార్థ గుర్తు చేస్తున్నారు. “మీ సిస్టమ్ నుండి ఫ్రెంచ్ ఫ్రైస్ ను తరిమికొట్టండి. ఇది ఎవరికీ మంచి చేయదు. బరువు తగ్గాలనుకునే వారు వీటిని పూర్తిగా పక్కన పెట్టడమే ఉత్తమం” అని ఆయన స్పష్టం చేశారు. కష్టపడి వర్కవుట్లు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని బాధపడేవారు, తమ ప్లేటులో ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఒకసారి గమనించాలి. తమన్నా వంటి స్టార్ల ఫిట్‌నెస్ రహస్యం ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడంలోనే ఉంది.
