AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban: అక్కడ ఆరు గ్రూపులు.. తాలిబన్ల గుట్టువిప్పిన ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి

Afghanistan Crisis:  ఆఫ్గానిస్థాన్‌‌‌లో రెండు దశాబ్ధాల తర్వాత తాలిబన్ అరాచక రాజ్యం మళ్లీ కొలువుదీరనుంది. ఆఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో పాకిస్థాన్, చైనాలు లోలోన మురిసిపోతున్నాయి.

Taliban: అక్కడ ఆరు గ్రూపులు.. తాలిబన్ల గుట్టువిప్పిన ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి
Janardhan Veluru
|

Updated on: Aug 20, 2021 | 7:41 PM

Share

Afghanistan Crisis:  ఆఫ్గానిస్థాన్‌‌‌లో రెండు దశాబ్ధాల తర్వాత తాలిబన్ అరాచక రాజ్యం మళ్లీ కొలువుదీరనుంది. ఆఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో పాకిస్థాన్, చైనాలు లోలోన మురిసిపోతున్నాయి. ఇప్పటికే తాలిబన్లతో స్నేహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి. అయితే ఆఫ్గాన్‌లో మతోన్మాద శక్తులు అధికార పీఠమెక్కడం భారత్‌కు ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాలిబన్లు బలం పుంజుకుంటే ఆ ప్రభావం నేరుగా జమ్ముకశ్మీర్‌పై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆఫ్గాన్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగానే భారత ప్రభుత్వం మౌనంగా ఉండిపోతోందన్న కథనాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి సోషల్ మీడియా వేదికగా తాలిబన్ల గుట్టువిప్పారు. తాలిబన్లలో మొత్తం 6 గ్రూపులున్నట్లు వెల్లడించిన స్వామి..అందులో రెండు గ్రూపులు పాకిస్థాన్ మిలటరీతో, ఒకటి చైనాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపారు. మిగతా మూడు గ్రూపులు అటు చైనాతో గానీ, ఇటు పాకిస్తాన్‌తోగానీ లేవని వెల్లడించారు. ఆ మేరకు అత్యంత విశ్వసనీయ సమాచారం తనకు అందినట్లు తెలిపారు. ఈ పరిణామాలను విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిశితంగా గమనించాలని స్వామి సూచించారు. ట్విట్టర్ వేదికగా సుబ్రహ్మణ్యన్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Afghanistan Talibans

Afghanistan Talibans

అటు సుబ్రహ్మణ్యన్ స్వామి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి అత్యంత కీలకమైన వ్యూహాత్మక సమాచారాన్ని సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేస్తున్నారని ఓ నెటిజన్ స్వామిని ప్రశ్నించారు. ఈ సమాచారాన్ని వ్యక్తిగతంగా విదేశాంగ కార్యాలయానికి లేదా జాతీయ భద్రతా సలహాదారుకు అందిస్తే బాగుండేదని పేర్కొన్నారు. సీనియర్ ఎంపీగా మీకున్న అనుభవాన్ని వారితో పంచుకోవచ్చని సలహా ఇచ్చారు. సుబ్రహ్మణ్యన్ స్వామి చెబుతున్నదంతా ఉత్తుత్తి సమాచారమేనని…దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని మరో నెటిజన్ పేర్కొన్నారు. జైశంకర్, దోవల్ శక్తిసామర్థ్యాల మీద తమకు విశ్వాసం ఉందని..ఆఫ్గాన్ వ్యవహారాల్లో స్వామి ఉచిత సలహాలు అవసరం లేదని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.

కాగా ఆఫ్గానిస్థాన్‌ వ్యవహారాల్లో భారత్‌కు ఎలాంటి పాత్ర లేకుండా పోయిందని, దీనికి నైతిక బాధ్యతవహిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ తన పదవికి రాజీనామా చేయాలని మరో నెటిజన్ డిమాండ్ చేశారు. సదరు నెటిజన్ ట్వీట్‌ను సుబ్రహ్మణ్యన్ స్వామి రీట్వీట్ చేయడం విశేషం.

Also Read..

సోనియా అధ్యక్షతన మెగా అపోజిషన్ మీటింగ్‌.. సీన్‌లోకి పీకే ఏంట్రీ.. మిషన్‌ 2024 టార్గెట్‌ స్ట్రాటజీ

‘ట్విట్టర్ బర్డ్‌’ను ఫ్రై చేసిన పర్యావసానం.. మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు పార్టీ నుంచి ప్యాక్!