కూరగాయల వ్యాపారి అలా చెప్పాడు.. అందుకే అలా చేశానంటున్న బీజేపీ ఎమ్మెల్యే..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో.. సామాన్య ప్రజానీకానీకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర సరకులతో పాటు.. నిత్యం కూరగాయలు కొనుక్కోవడానికి దాదాపు అంతా మార్కెట్లకు వెళ్లకుండా.. కాలనీల్లోకి వచ్చే కూరగాయల విక్రయాదారులనే సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో యూపీలో కాలనీల్లో తిరిగి అమ్మే విక్రయదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. గత మార్చి నెలలో తబ్లీఘీ జమాత్‌ సమావేశానికి హాజరైన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ సోకడం.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ […]

కూరగాయల వ్యాపారి అలా చెప్పాడు.. అందుకే అలా చేశానంటున్న బీజేపీ ఎమ్మెల్యే..
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 6:13 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో.. సామాన్య ప్రజానీకానీకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర సరకులతో పాటు.. నిత్యం కూరగాయలు కొనుక్కోవడానికి దాదాపు అంతా మార్కెట్లకు వెళ్లకుండా.. కాలనీల్లోకి వచ్చే కూరగాయల విక్రయాదారులనే సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో యూపీలో కాలనీల్లో తిరిగి అమ్మే విక్రయదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. గత మార్చి నెలలో తబ్లీఘీ జమాత్‌ సమావేశానికి హాజరైన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ సోకడం.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో యూపీలో పలువురు బీజేపీ నేతల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. హిందువులు ఎవరు కూడా ముస్లింల వద్ద కూరగాయలు కొనద్దంటూ ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చేసి 24 గంటలు కూడా గడవకముందే.. లక్నోలో బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ రాజ్‌పుత్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఓ ముస్లిం కూరగాయల వ్యాపారి వారి కాలనీకి వస్తే. బెదిరించి పంపించేశారు. దీంతో సదరు కూరగాయల వ్యాపారి భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇదే విషయాన్ని సదరు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే.. లక్నోలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం ఉందని.. అందుకే ఆ కూరగాయలు అమ్ముతున్న వ్యక్తిని పేరు.. వివరాలు అడిగానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. సదరు వ్యక్తి ముస్లిం అని.. అయితే హిందూ పేరు చెప్పి కూరగాయలు అమ్ముతున్నారంటూ ఆరోపించారు. అందుకే ఇక్కడి నుంచి పంపించేశానంటూ సమర్ధించుకున్నారు.

కాగా.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం కూడా స్పందించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఇలాంటి ప్రకటనలు చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.

Latest Articles
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ