లాక్ డౌన్ వేళ.. వారికి భారీగా పెరిగిన గిరాకీ..!

Astrologers: కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఇళ్లకే పరిమితమైన భారతీయులు తమ భవిష్యత్తుపై ఆస్ట్రాలజీని ఆశ్రయిస్తుండడంతో ఇప్పుడు జ్యోతిష్కులకు భారీగా గిరాకీ పెరిగింది. ప్రత్యేకించి ఫోన్‌ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా సమాధానాలు చెబుతున్న జ్యోతిష్కులు రెండు చేతులా సంపాదిస్తున్నట్టు కనిపిస్తోంది. వివరాల్లోకెళితే.. మూతపడిన పరిశ్రమలు, ఫైనాన్షియల్ మార్కెట్లపైనే జనాలకు ఎక్కువగా బెంగపట్టుకున్నట్టు ఆస్ట్రాలజిస్టులు చెబుతున్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో చాలామంది ఆరోగ్య పరిస్థితిపై […]

లాక్ డౌన్ వేళ.. వారికి భారీగా పెరిగిన గిరాకీ..!
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 5:43 PM

Astrologers: కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఇళ్లకే పరిమితమైన భారతీయులు తమ భవిష్యత్తుపై ఆస్ట్రాలజీని ఆశ్రయిస్తుండడంతో ఇప్పుడు జ్యోతిష్కులకు భారీగా గిరాకీ పెరిగింది. ప్రత్యేకించి ఫోన్‌ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా సమాధానాలు చెబుతున్న జ్యోతిష్కులు రెండు చేతులా సంపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.

వివరాల్లోకెళితే.. మూతపడిన పరిశ్రమలు, ఫైనాన్షియల్ మార్కెట్లపైనే జనాలకు ఎక్కువగా బెంగపట్టుకున్నట్టు ఆస్ట్రాలజిస్టులు చెబుతున్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో చాలామంది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తుండగా.. యువతరం తమ కెరీర్ గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారట. అడపాదడపా కొందరు ప్రేమికులు కూడా తమకు ఫోన్ చేసి ఈ ఏడాది తమ పరిస్థితి ఎలా ఉంటుందో ఆరాతీస్తున్నట్టు పండితులు వెల్లడించారు.

కాగా.. గత కొద్ది రోజులుగా.. ప్రతి రోజూ వంద నుంచి 250 ఫోన్ కాల్స్ పెరిగాయని ఆస్ట్రోయోగి వెబ్‌సైట్ చీఫ్ ఆదిత్య కపూర్ వెల్లడించారు. 22 నుంచి 40 ఏళ్ల లోపువారే ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారనీ.. అధిక శాతం మంది తమ కెరీర్ పరిస్థితిపైనే ప్రశ్నలు అడుగుతున్నారని ఆయన తెలిపారు. దాదాపు 400 మంది జ్యోతిష్కులున్న ఈ వెబ్‌సైట్లో… తమకున్న పాపులారిటీని బట్టి పండితులు ఒక్కో నిమిషానికి రూ.12 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నట్టు ఆదిత్య తెలిపారు.

అయితే.. దిగ్గజ ఆస్ట్రాలజీ వెబ్‌సైట్ ఆస్ట్రోసేజ్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ పాండే మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ నేపథ్యంలో మా ఆదాయం 42 శాతం పెరిగింది. మా ఈ-మెయిల్ కన్సల్టేషన్లకు బాగా ప్రాచుర్యం ఉంది. ఒక్కో ప్రశ్నకు రూ.250 నుంచి రూ.300 వరకు చార్జ్ చేస్తాం. అదే ఫోన్ కాల్ అయితే 15 నిమిషాలకు రూ.400 వరకు ఖర్చవుతుంది..’’ అని తెలిపారు. దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఎన్నారైలు సైతం తమను సంప్రదిస్తున్నట్టు జ్యోతిష్కులు పేర్కొన్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో