Bird Flu in Maharashtra: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ రోజు రోజుకీ వ్యాపిస్తుంది. ఆ రాష్ట్రంలో మరో 983 పక్షులు మృతి చెందాయి. వాటి నమూనాలను పరీక్ష నిమిత్తం పుణె, భోపాల్‌లోని డీఐఎస్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపినట్లు అధికారులు చెప్పారు. లాతూర్, యావత్మల్, అహ్మద్ నగర్, వార్ధా, గోందియా, నాగ్పూర్ పౌల్ట్రీలో కోళ్లు మృతి చెందాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఘోడ్‌బందర్, దపోలిలో కాకులు, హెరాన్స్ బర్డ్, మురాంబాలో కోళ్ల శాంపిల్స్ లో ఎయిన్ ఫ్లూ ఉన్నట్లు తేలిందని దీంతో ఆ ప్రాంతాల్లో నిషేధ ప్రాంతంగా ప్రకటించామని తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 5,151 పక్షులు మృతి చెందాయని.. మరికొన్ని ప్రాంతాల్లో కల్లింగ్ చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బర్డ్ ఫ్లూ పై రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది.
Also Read: దేశ రాజధాని ఢిల్లీని కప్పేసిన పొగమంచు… తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు