Bird Flu: దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం.. చికిత్స పొందతూ 11 ఏళ్ల బాలుడు మృతి..
తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ మరింత ఆందోళనను పెంచుతోంది. దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందతూ..

అసలే కోవిడ్ టెన్షన్.. ఆపై కరోనా కొత్త వేరియంట్లతో జనాలు భయభ్రాంతులకు గురవుతుంటే.. తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ మరింత ఆందోళనను పెంచుతోంది. దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందతూ 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. దీనితో అతడికి చికిత్స చేసిన డాక్టర్లు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు.
హర్యానాకు చెందిన 11 ఏళ్ల సుశీల్.. ఈ నెల 2వ తేదీన న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరాడు. మొదటిగా డాక్టర్లు అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. రిపోర్ట్‌లో నెగటివ్ తేలింది. అనంతరం నమూనాలను పూణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపించడంతో.. బర్డ్ ఫ్లూ సోకినట్లుగా నిర్ధారణ అయింది. దీనితో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిశోధకులు అప్రమత్తమయ్యారు. మరిన్ని కేసులు గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఆ బాలుడి స్వగ్రామానికి పంపారు.
బర్డ్ ఫ్లూ (H5N1 వైరస్)ను ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని కూడా పిలుస్తారు. పక్షులకు, కోళ్ళలో వచ్చే ఈ వైరస్ మనిషికి సోకడం దేశంలో ఇదే తొలిసారి. ఈ ఏడాది ప్రారంభంలో దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ బీభత్సం సృష్టించింది. వేల సంఖ్యలో పక్షులు, కోళ్లు, నెమళ్లు.. పలు రాష్ట్రాల్లో కాకులు, బాతులు మృతి చెందాయి. కాగా, బర్డ్ ఫ్లూ మనుషులకు సోకడం తక్కువ అని.. ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ సోకకుండా ఉండాలంటే ఇలా చేయండి…
గతంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) బర్డ్ ఫ్లూ సోకకుండా ఉండేందుకు పలు మార్గదర్శకాలను సూచించింది. అవి ఇలా ఉన్నాయి.. సగం ఉడికిన గుడ్లు తినకూడదు. అలాగే సరిగ్గా ఉడకని చికెన్ తినొద్దని సూచింది. ఫ్లూ సోకిన ప్రదేశాల్లో పక్షులను, అదే విధంగా చనిపోయిన పక్షులను గ్లౌజ్‌లు లేకుండా ఉత్త చేతులతో తాకకూడదు. పచ్చి మాంసాన్ని బహరింగంగా పెట్టకూడదని, అలాంటి మాంసాన్ని నేరుగా తినొద్దని సూచింది. ఇక చివరికి పచ్చి మాంసం పట్టుకునే సమయంలోనూ మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. తరుచూ చేతులు కడుక్కోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Also Read:
మీ పర్సులో డబ్బులు నిలవాలంటే.. ఈ వస్తువులు ఉంచుకోకూడదు.! అవేంటంటే..
పాము, ముంగీస మధ్య హోరాహోరీ ఫైట్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే.!
