AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీకి బిపిన్‌ రావత్‌తో సహా 13మంది మృతదేహాలు.. ప్రత్యేక విమానంలో పాలెం ఎయిర్‌పోర్టకు తరలింపు

తమిళనాడు లోని కున్నూరు హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు 13 మంది మృతదేహాలను తీసుకొస్తున్న విమానం మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటుంది.

ఢిల్లీకి బిపిన్‌ రావత్‌తో సహా 13మంది మృతదేహాలు.. ప్రత్యేక విమానంలో పాలెం ఎయిర్‌పోర్టకు తరలింపు
Bipin Rawat Body
Balaraju Goud
|

Updated on: Dec 09, 2021 | 8:27 PM

Share

Bipin Rawat body to Delhi: తమిళనాడులోని కున్నూరు హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు 13 మంది భౌతికకాయాలను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. C-130J విమానంలో మృతదేహాలను ఢిల్లీ లోని పాలెం ఎయిర్‌పోర్టకు తరలించారు. పలువురు ప్రముఖులు ఎయిర్‌పోర్ట్‌లో జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు అమర జవాన్ల భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్నారు. రాత్రి 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ… రావత్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పిస్తారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ , త్రివిధ దళాధిపతులు కూడా నివాళి అర్పించారు.

జనరల్‌ రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్, వింగ్‌ కమాండర్‌ పీఎస్‌ చౌహాన్, స్క్వాడ్రన్‌ లీడర్‌ కే సింగ్, నాయక్‌ గురుసేవక్‌సింగ్, నాయక్‌ జితేందర్‌ కుమార్, లాన్స్‌నాయక్‌ వివేక్, లాన్స్‌ నాయక్‌ బీ సాయితేజ, హవల్దార్‌ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్‌ మృతదేహాలను ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకొచ్చారు.

తమిళనాడు లోని సుల్లూరు ఎయిర్‌బేస్‌ నుంచి ఈ విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లు వస్తున్న సమయంలో స్థానికులు అమర జవాన్లకు ఘననివాళి అర్పించారు. జనరల్‌ రావత్‌తో పాటు ఇతర జవాన్ల మృతదేహాలను తీసుకొస్తున్న అంబులెన్స్‌లపై పూలవర్షం కురిపించారు . బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తకు ఆదేశించింది. ఎయిర్‌మార్షల్ మాన్వెందర్‌సింగ్‌ నేతృత్వం లోని త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదికను ఇస్తుందని పార్లమెంట్‌కు తెలిపారు రక్షశణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.

శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌..జనరల్‌ బిపిన్‌ రావత్‌ హఠాన్మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖులతో పాటు సామాన్య పౌరులు కూడా తమకు తోచిన రీతిలో నివాళి అర్పిస్తున్నారు. కర్నాటకకు చెందిన ఓ అభిమాని ఆకుపై జనరల్‌ రావత్‌ చిత్రాన్ని గీసి అద్భుతమైన నివాళి అర్పించారు. శుక్రవారం జనరల్ బిపిన్‌రావత్‌ , ఆయన భార్య మధులిక రావత్‌ అంత్యక్రియలు జరుగుతాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. Read Also…. శ్రీరామానుజాచార్య స్వామి భారీ విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధం.. హర్యానా గవర్నర్, సీఎంకు చినజీయర్ స్వామి ఆహ్వానం