AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakesh Jhunjhunwala: భారతీయ అత్యంత సంపన్నుల్లో ఒకరైన రాకేష్ జున్‌ జున్‌ వాలా మృతి.. బిగ్ బుల్ ఆఫ్ ఇండియా ప్రసిద్ధి

భారతీయ బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్, స్టాక్ ట్రేడర్ , ఇన్వెస్టర్ అయిన రాకేష్ జున్‌జున్‌వాలా 62 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన "బిగ్ బుల్ ఆఫ్ ఇండియా" , "కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్" గా ప్రసిద్ది చెందాడు

Rakesh Jhunjhunwala: భారతీయ అత్యంత సంపన్నుల్లో ఒకరైన రాకేష్ జున్‌ జున్‌ వాలా మృతి.. బిగ్ బుల్ ఆఫ్ ఇండియా ప్రసిద్ధి
Rakesh Jhunjhunwala
Surya Kala
|

Updated on: Aug 14, 2022 | 10:21 AM

Share

Rakesh Jhunjhunwala: భారత దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన రాకేష్  జున్‌జున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. హఠాత్తుగా అనారోగ్యానికి గురైన రాకేష్ ను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనే మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. రాకేష్ మృతిపై ప్రధాని మోడీ సహా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.  భారతీయ బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ అయిన రాకేష్ జున్‌జున్‌వాలా 62 ఏళ్ల వయసులో మరణించారు. రాకేష్ వ్యాపారి, చార్టర్డ్ అకౌంటెంట్, దేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. జున్‌జున్‌వాలా హంగామా మీడియా, ఆప్‌టెక్‌లకు చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతేకాదు వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా,  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.

రాజస్థానీ కుటుంబానికి చెందిన రాకేష్ జూలై 5, 1960న జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైలో పెరిగారు. అతని తండ్రి ఆదాయపు పన్ను కమిషనర్‌గా ముంబై లో పనిచేశారు. సిడెన్‌హామ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరాడు.కేవలం ₹ 5,000 పెట్టుబడితో కాలేజీ స్టూడెంట్ గా ఉండగానే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి.. తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రసుత్తం అంచనా ప్రకారం అతని ఆస్తుల నికర విలువ $5.5 బిలియన్లు (జూలై 2022 నాటికి). భారతదేశంలో 36వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.

పెట్టుబడిదారుమాత్రమే కాదు..  జున్‌జున్‌వాలా ఆప్‌టెక్ లిమిటెడ్ , హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు. లిమిటెడ్, ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బిల్‌కేర్ లిమిటెడ్, ప్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోవోగ్ ఇండియా లిమిటెడ్, కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్, ఇన్నోవాసింత్ టెక్నాలజీస్ లిమిటెడ్, మిడ్ డే మల్టీమీడియా లిమిటెడ్, నాగార్జున కాన్‌స్టరుక్షన్ లిమిటెడ్, విసెర్చ్‌లో వంటి అనేక సంస్థలలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాకేష్ “బిగ్ బుల్ ఆఫ్ ఇండియా”, “కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్” అని ప్రసిద్ది చెందారు. మాజీ జెట్ ఎయిర్‌వేస్ CEO వినయ్ దూబే కలిసి రాకేష్ జున్‌జున్‌వాలా ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థను స్థాపించారు.

మరిన్ని  జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..