బీహార్ ఎన్నికలు, సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్
బీహార్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ప్రస్తుత సీఎం, జేడీ-యూ అధినేత అని జేడీ-యూ-బీజేపీ కూటమి ప్రకటించింది. ఎన్నికల్లో తాము కలిసికట్టుగా పోటీ చేస్తామని నితీష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర అభివృధ్ది కోసం..

బీహార్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ప్రస్తుత సీఎం, జేడీ-యూ అధినేత నితీష్ కుమార్ అని జేడీ-యూ-బీజేపీ కూటమి ప్రకటించింది. ఎన్నికల్లో తాము కలిసికట్టుగా పోటీ చేస్తామని నితీష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర అభివృధ్ది కోసం తాము బీజేపీతో కలిసి పని చేస్తామన్నారు. సీట్ల సర్దుబాటులో తమ మధ్య ఎలాంటి విభేదాలు, అపోహలు లేవని ఆయన చెప్పారు. తమకు మొత్తం 122 సీట్లు ఇచ్చ్చారని, వాటిలో ఏడింటిని జితన్ రామ్ మంజి నేతృత్వంలోని హిందుస్తానీ అవామీ మోర్ఛాకు కేటాయించామని ఆయన చెప్పారు, బీజేపీ 121 సీట్లకు పోటీ చేస్తుందన్నారు. తన కోటా నుంచి ఆ పార్టీ వికాస్ సీల్ ఇన్సాఫ్ పార్టీకి ఇస్తుందని నితీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలను తీవ్రంగా విమర్శించారు.



