Rahul-Nitish Kumar: ఢిల్లీలో రాహుల్‌తో నితీష్ కుమార్ భేటీ.. యాభై నిమిషాల పాటు ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలుసుకున్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిశారు. ఇరువురు నేతల మధ్య దాదాపు యాభై నిమిషాల పాటు భేటీ జరిగింది. బీహార్‌లో కాంగ్రెస్ మద్దతుతో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నితీష్ కుమార్, రాహుల్ గాంధీల తొలి సమావేశం ఇదే. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అనంతరం బయటకు వచ్చిన సీఎం నితీశ్ మీడియాతో మాట్లాడలేదు. బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ నితీష్ కుమార్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలని ఆదివారం నాడు రాహుల్ గాంధీ మాట్లాడిన తరుణంలో ఈ భేటీ జరిగింది.
అదే సమయంలో బీహార్‌లో అధికార బదలాయింపు తర్వాత నితీష్ కుమార్ కూడా ఏకం కావడాన్ని సమర్థిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ చేరుకున్న సీఎం నితీశ్ కుమార్.. తనకు ప్రధాని కావాలనే కోరిక లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం నితీశ్ విలేకరులతో మాట్లాడుతూ.. నాకు ప్రధాని కావాలనే కోరిక లేదని అన్నారు. నాకు కావలసింది ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని రాహుల్ గాంధీని కలిసే ముందు ఈ ప్రకటన చేశారు నితీష్ కుమార్.
మరిన్ని జాతీయ వార్తల కోసం