AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం ఆదేశాలపై భారత్ బయో టెక్ ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ సరఫరా ఆపేసింది, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపణ, ఖండించిన సంస్థ

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై భారత్ బయోటెక్ కంపెనీ తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులను తమ రాష్ట్రానికి సరఫరా చేయడానికి నిరాకరించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.

కేంద్రం ఆదేశాలపై భారత్ బయో టెక్ 'కోవాగ్జిన్' వ్యాక్సిన్ సరఫరా ఆపేసింది, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపణ, ఖండించిన సంస్థ
Manish Sisodia
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 12, 2021 | 4:33 PM

Share

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై భారత్ బయోటెక్ కంపెనీ తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులను తమ రాష్ట్రానికి సరఫరా చేయడానికి నిరాకరించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. అంటే కేంద్రం కోవిడ్ వ్యాక్సిన్ల సప్లయ్ పై పెత్తనం వహిస్తోందని అర్థమవుతోందన్నారు. ఇది వ్యాక్సిన్ మిస్ మేనేజ్ మెంట్ అని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయని, పైగా తమవద్ద పరిమితంగా మాత్రమే వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని, ఈ కారణంగానే టీకామందు పంపలేకపోతున్నామని భారత్ బయో టెక్ సంస్థ చెబుతోందని ఆయన అన్నారు. బుధవారం మీడియాతో వర్చ్యువల్ గా మాట్లాడిన ఆయన.. ఈ మేరకు ఈ కంపెనీ తమకు లేఖ రాసిందని చెప్పారు. 18-44 ఏళ్ళ మధ్య వయస్సు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం 1,34 కోట్ల డోసులను కోరిందన్నారు. కోవిషీల్డ్,కొవాగ్జిన్ రెండు టీకామందులనూ మేం కోరుతున్నాం అని చెప్పారు. ఏ రాష్ట్రం ఎంత మేర వ్యాక్సిన్ పొందుతుందన్న విషయాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని సీరం సంస్థ, భారత్ బయో టెక్ చెబుతున్నాయని ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వ అభ్యర్థనకు భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా పంపిన లేఖను కూడా సిసోడియా తన ట్విటర్ లో షేర్ చేశారు.

అయితే ఈ సంస్థ కో-ఫౌండర్ సుచిత్ర ఎల్లా..ఈ ట్వీట్లకు కౌంటర్ ఇస్తూ తమా టీకామందును ఈ నెల 10 న 18 రాష్ట్రాలకు పంపామని, కానీ కొన్ని రాష్ట్రాలు తమకు దురుద్దేశాలను ఆపాదించడం దురదృష్టకరమని అన్నారు. కోవిడ్ కారణంగా తమ కంపెనీలో 50 మంది ఉద్యోగులు పని చేయలేకపోతున్నారని, కానీ ఈ పాండమిక్, లాక్ డౌన్ సమయంలో కూడా వారంలో 24 గంటలూ మేము పని చేస్తున్నామని ఆమె ట్వీట్ చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Helping Hands: ‘‘కరోనా సోకి ఇబ్బంది పడుతున్నారా? మీకు అండగా మేముంటాం.. ఈ నెంబర్‌కు కాల్ చేయండి..’’

Eid-ul-Fitr 2021: రంజాన్, ఈద్-ఉల్-ఫితర్‌ పండుగల కోసం మీ ఇంటిని ఇలా అందంగా అలంకరించుకోండిలా..