Beware of Covid-19 : కరోనా వైరస్‌పై మరో షాకింగ్ న్యూస్.. కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు
కరోనా వైరస్ మనదేశంలో అడుగు పెట్టినప్పుడు ఈ వైరస్ ప్రభావం ఎక్కువుగా శ్వాసకోశ వ్యాధులను కలుగ జేస్తుందని భావించారు. లంగ్స్ ప్రొబ్లెమ్స్ ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ మన..
Beware of Covid-19 : కరోనా వైరస్ మనదేశంలో అడుగు పెట్టినప్పుడు ఈ వైరస్ ప్రభావం ఎక్కువుగా శ్వాసకోశ వ్యాధులను కలుగ జేస్తుందని భావించారు. లంగ్స్ ప్రొబ్లెమ్స్ ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ మన శరీరంలోని లంగ్స్ మీద కంటే కిడ్నీలపై ఎక్కువ చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా అదుపులోకి వచ్చినట్లు కనిపించిన కరోనా వైరస్.. మళ్ళీ రూపం మార్చుకుని కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళనవ్యక్తం చేస్తున్నాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అయితే ఇప్పుడు సరికొత్త అధ్యయనంలో కరోనా వైరస్ వలన మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని పేర్కొంది.
కోవిడ్ -19 ప్రభావం హృదయ సంబంధ వ్యాధులు , ఊపిరితిత్తులపై ప్రభావం ఉన్నప్పటికీ మూత్రపిండాల సమస్యలు ఉన్న రోగులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అంతేకాదు.. కరోనా వైరస్ మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. కరోనా వైరాస్ బారిన పడిన వ్యక్తుల్లో ఎక్కువమందికి కిడ్నీ దెబ్బతినడం,, గాయం కావడం గుర్తించామని .. ఈ విధంగా కిడ్నీ వైఫల్యాన్ని ఎఆర్ఎఫ్ పిలుస్తారని చెప్పారు.
కిడ్నీలు కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో వైఫల్యానికి గురవడాన్నీ ఎఆర్ఎఫ్ అంటారు. అప్పుడు కిడ్నీలు రక్తంలో వ్యర్ధాలను శుభ్రపరచడం కష్టమవుతుంది. ఇక మూత్రపిండాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీంతో మెదడు, గుండె , ఊపిరితిత్తులు వంటి ఇతర అవయవాలపై కూడా ప్రభావం పడుతుంది. కోవిడ్ 19 వ్యాధితో ఆస్పత్రిలో చేరిన రోగుల్లో 10 నుంచి 20 శాతం మందిలో ఎకెఐకి ని గుర్తించామని ఢిల్లీ కి చెందిన నెఫ్రాలజీ దీపక్ కల్రా చెప్పారు. కరోనా బారిన పడిన రోగుల్లో ఎకెఐ లేని వారు 10 శాతం మంది మరణిస్తే..ఈ ఎకెఐ ఉన్న రోగుల్లో 72 శాతం మరణించారని అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ పరిశోధకులు చెప్పారు. కోవిడ్ -19 నేరుగా రోగనిరోధక శక్తి మరియు అవయవాలపై దాడి చేస్తుంది.. ఇది వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి యొక్క తీవ్రతను పెంచుతుందని సీనియర్ కన్సల్టెంట్ డయాలసిస్ విభాగం చీఫ్ రాజేష్ అగర్వాల్ అన్నారు. అందుకని కిడ్నీ సంబంధిత రోగులు కరోనా వైరస్ నుంచి పూర్తిగా జాగ్రత్తగా ఉండాలని.. మార్చి 11న ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అగర్వాల్ చెప్పారు.
Also Read: సనాతన ధర్మంలో భారతీయ మహిళ చీర ధరించడానికి శాస్త్రీయ కోణం కూడా ఉందని తెలుసా..!