Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: ఇంతకీ జయలలిత దగ్గర ఎన్ని కేజీల బంగారం ఉంది..? అది ఎవరికి చెందుతుంది..?

దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన బంగారు, వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదలాయించాలని బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. జయలలిత, ఇతరులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సాక్ష్యంగా ఉన్న ఈ బంగారు, వజ్రాల ఆభరణాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

Tamil Nadu: ఇంతకీ జయలలిత దగ్గర ఎన్ని కేజీల బంగారం ఉంది..? అది ఎవరికి చెందుతుంది..?
Jayalalitha's Gold And Diamond Jewellery
Follow us
Ch Murali

| Edited By: Balaraju Goud

Updated on: Jan 30, 2025 | 7:08 PM

తమిళనాడుకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అవినీతి కేసులో జైలుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న కిలోల కొద్దీ బంగారం ఇన్నాళ్లు కర్ణాటక సీబీఐ కోర్టు వద్దే ఉండగా, తాజా ఆ బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. ఇంతకీ ఆ బంగారం ఎంత.. దాన్ని ఏం చేస్తారు.. దానిపై ఎవరెవరు ఆశలు పెట్టుకున్నారో తెలుసుకుందాం..!

ఎడిఎంకె పార్టీలో కీలకంగా ఉన్న దివంగత జయలలిత 1991లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో అధికారంలోకి వచ్చిన డీఎంకే హయాంలో ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ కేసు నమోదైంది. జయలలిత దత్తపుత్రుడిగా చెప్పబడే సుధాకరన్ వివాహం 1995లో ఒక విలాసవంతంగా జరిగింది. ఆతర్వాత డీఎంకే అధికారంలోకి రాగానే అవినీతి అక్రమాల కేసు నమోదైంది. జయలలిత తోపాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్, ఇళవరసి నలుగురిపై కూడా నమోదైంది.

ఈ కేసు విచారణ తమిళనాడులో ఉంటే ప్రభావితం ఉంటుందన్న పిటిషన్ తో కర్ణాటక కోర్టుకు బదిలీ కాగా, అక్కడే విచారణ జరిగింది. ఈ కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేస్తుండగా, 2014లో వారందరికీ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు అప్పీలు చేయడంతో శిక్షను రద్దు చేసింది. కానీ ఈ ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులపై జయలలిత కుటుంబ సభ్యులకు అర్హత లేదని గతంలో ప్రత్యేక కోర్టు చెప్పడంతో.. జయలలిత మేనకోడలు దీపా, దీపక్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

‘నగలను వేలం వేసే బదులు తమిళనాడు రాష్ట్ర హోంశాఖ ద్వారా వాటిని అప్పగించి తమిళనాడుకు బదిలీ చేయడమే మేలు’ అంటూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆ నగలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించారు. జయలలిత సహా నలుగురికి బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే, జయలలిత అనారోగ్యంతో డిసెంబర్ 5, 2016న మరణించారు. దీని తరువాత, ముగ్గురూ – శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. వారి మొత్తం శిక్ష పూర్తయిన తర్వాత వారిని విడుదల చేశారు.

జయలలితపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో, ఆమె ఆస్తులన్నీ 2004లో కర్ణాటక ప్రభుత్వ ఖజానాకు బదిలీ అయ్యాయి. మొదట తమిళనాడులో ఉన్న కేసును కర్ణాటకకు బదిలీ చేసి, అక్కడ స్వాధీనం చేసుకున్న వస్తువులను కూడా అక్కడికే తీసుకెళ్లారు. ప్రస్తుతం బెంగళూరులోని ప్రభుత్వ ఖజానాలో జయలలిత ఆస్తుల్లో పది వేల చీరలు, 750 జతల చెప్పులు, ఖరీదైన గడియారాలు మరియు బంగారు, వజ్రాల ఆభరణాలు ఉన్నాయి. తాజాగా సీబీఐ కోర్టు జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 27 కిలోల నగలు మరియు 1562 ఎకరాల భూమిని ఫిబ్రవరి 14, 15 తేదీలలో తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని ఆదేశించింది. నగలు సహా పత్రాలను తీసుకెళ్లడానికి సంబంధించి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

తమిళనాడు నుండి ఏసీబీ అధికారులు 6 పెట్టెలతో బెంగళూరుకు రావాలని ఆభరణాలను భద్రంగా తీసికువెళ్లేందుకు తగినంత భద్రత ఉండాలి. ఆభరణాలను అంచనా వేయడానికి అప్రైజర్లు తప్పనిసరిగా హాజరు కావాలి. ప్రతిదీ సరిచూసుకున్న తర్వాతే వాటిని ఏసీబీకి అప్పగించాలి. దీనికి సంబంధించిన భద్రతా పనులను కర్ణాటక పోలీసులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ బంగారం కోసం జయలలిత మేనకోడలు దీపా కోర్టును ఆశ్రయించింది. అయితే అందుకు కోర్టు అంగీకరించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..