బెంగళూరులో పెరిగిన రైల్వే ఫ్లాట్‌ఫామ్ ధరలు.. ఏకంగా

దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలు కావడంతో దాదాపుగా అన్ని రంగాలు తిరిగి సేవలను ప్రారంభిస్తున్నాయి. ఇక ఈ నెల 12 నుంచి

బెంగళూరులో పెరిగిన రైల్వే ఫ్లాట్‌ఫామ్ ధరలు.. ఏకంగా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 11, 2020 | 6:01 PM

Bengaluru platform ticket : దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలు కావడంతో దాదాపుగా అన్ని రంగాలు తిరిగి సేవలను ప్రారంభిస్తున్నాయి. ఇక ఈ నెల 12 నుంచి దేశవ్యాప్తంగా 80 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ క్రమంలో రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లలో రద్దీని తగ్గించేందుకు సౌత్ వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని మూడు స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌ ధరలను పెంచేసింది. గతంలో ఈ ధరలు రూ.10లు ఉండగా.. ఇప్పుడు రూ.50లకు పెంచింది. అయితే ఈ ధరలు తాత్కాలికంగా పెంచినవి మాత్రమేనని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఈ క్రమంలో బెంగళూరులోని  కేఎస్‌ఆర్ బెంగళూరు, బెంగళూరు కంటోన్‌మెంట్‌, యశ్వంత్‌పూర్ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌లో ఇకపై ఫ్లాట్‌ఫామ్‌ల ధర రూ.50లుగా వసూలు చేయనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో క్లోన్ ట్రైన్స్‌ని నడుపుతామని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Read More:

ఆ విషయం కొందరు దుర్మార్గపు మనస్తత్వాలకు తెలీదు: సుశాంత్‌పై అభిషేక్ ట్వీట్‌

‘బిగ్‌బాస్‌’లోకి హీరోయిన్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ..!