అసోం సర్కార్ కీలక నిర్ణయం.. కరోనాతో చనిపోతే రూ.5,000
అసోం ప్రభుత్వం కరోనాతో చనిపోయిన వారి కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కష్ట కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తోంది.
కరోనా వైరస్… ఈ పేరు వింటే ఒంటిలో వణుకుపుడుతోంది. ఎవరి నుంచి ఏ రూపంలో అంటుకుంటుందోనన్న బెంగ అందరిలో.. వైరస్ సోకిన వ్యక్తులను నుంచి నా అన్న వేరు దూరంగా జరుగుతున్నారు. కనీసం వారి బాగోగులు కూడా చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కర్మకాలీ కాలం చేస్తే వారిని పట్టించుకునే దిక్కు కూడా ఉండటం లేదు. అలాంటి అసోం ప్రభుత్వం కరోనాతో చనిపోయిన వారి కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కష్ట కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తోంది. కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి అంత్యక్రియలకు ఖర్చులు భరించలేని కుటుంబాలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. నేషనల్ హెల్త్ మిషన్ నుంచి బాధిత కుటుంబాలకు ఈ సాయం అదిస్తామని అసోం ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొవిడ్ తో చనిపోయిన వారి మృతదేహాలు అందకపోయినా, అంత్యక్రియల ఖర్చులు భరించలేకపోయినా రూ.5,000 వరకూ ఖర్చులు నిమిత్తం చెల్లించాలని నిర్ణయించినట్టు అసోం ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు అసోం కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 29,690 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు కరోనా బారిన పడి 414 మంది మృత్యువాత పడ్డారు.