Bangaluru: వామ్మో.. మరి ఇంతలా పెంచుతారా ఫ్లాట్ రెంట్లు.. అడ్వాన్స్‌కే రూ.25 లక్షలు
సొంత ఇళ్లు కట్టుకోలేనివారు, కొనుక్కోలేనివారు చాలామంది అద్దె ఇళ్లలో ఉంటారు. పట్టణాలు, మహానగరాల్లో అయితే సొంత ఇళ్లు ఉన్నవారి కంటే అద్దె ఇంట్లో ఉండేవారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే అద్దెకు ఉండే ఫ్లాట్స్ నెలసరి రేట్లు ఆయా ప్రాంతాలను బట్టి ఉంటుంది. ముఖ్యంగా బెంగళూరు లాంటి మహానగరాల్లో ఫ్లాట్ రెంట్ ధరలు రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్నాయి.

సొంత ఇళ్లు కట్టుకోలేనివారు, కొనుక్కోలేనివారు చాలామంది అద్దె ఇళ్లలో ఉంటారు. పట్టణాలు, మహానగరాల్లో అయితే సొంత ఇళ్లు ఉన్నవారి కంటే అద్దె ఇంట్లో ఉండేవారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే అద్దెకు ఉండే ఫ్లాట్స్ నెలసరి రేట్లు ఆయా ప్రాంతాలను బట్టి ఉంటుంది. ముఖ్యంగా బెంగళూరు లాంటి మహానగరాల్లో ఫ్లాట్ రెంట్ ధరలు రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఓ ఫ్లాట్ అద్దె అడ్వాన్సు రూ.25 లక్షలు చెల్లించాలనే ట్వీట్ వైరలవుతోంది. ఇది చూసిన నెటీజన్లు షాకవుతున్నారు. మరి ఇంతలా ఫ్లాట్ రెంట్ ధరలు పెరిగిపోతున్నాయేంటని ఆందోళన చెందుతున్నారు. కరోనా సమయంలో టెక్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేవారు. అయితే ఇప్పుడు ఆఫీస్‌లకు తిరిగిరావడంతో బెంగళూరులోని ఇళ్ల అద్దెలు విపరీతంగా పెంచేస్తున్నారు. నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో ఆ ఫ్లాట్ అద్దె నెలకు 2.5 లక్షల రూపాయలు. అయితే ఆ ఇల్లు అద్దెకివ్వాలంటే మాత్రం అడ్వాన్స్ 25 లక్షల రూపాయలు చెల్లించాలని ఉండటంతో నెటీజన్లు ఆశ్చర్యపోతున్నారు.
హెచ్‌ఎస్ఆర్ లేఔట్‌లోని 4 బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెల రెంట్ రూ.2.5 లక్షలు, అడ్వాన్స్ 25 లక్షలు చెల్లించాలంటూ ఉన్న ప్రకటనను తేజస్వీ శ్రీవాస్తవ అనే టెక్ కంపెనీ సీఈఓ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫ్లాట్ ధరల ఇంతలా పెరగడాన్ని చూసి ఆయన షాకయ్యారు. అలాగే అడ్వాన్స్ చెల్లించడానికి అవసరమైన మొత్తానికి లోన్ ఆప్షన్ కూడా ఉండటంతో ఆయన మరింత ఆశ్యర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫ్లాట్ ప్రకటనను ఆయన స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కిడ్నీ అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ ఉంటే బాగుండేదని ఆయన తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ ట్వీట్‌పై నెటీజన్లు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇంటి అద్దె అంతలా పెంచడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు లోన్ కోసం అప్లే చేసుకునే ఆప్షన్‌పై మండిపడుతున్నారు. అయితే చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం యజమానులు మర్చిపోయి ఉంటారని ఓ వ్యక్తి వ్యంగంగా ట్వీట్ చేశారు.




They should add an option: Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF
— Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.




