AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమెకు 21, అతనికి 57 ఏళ్లు.. టీ తాగుదాం రండి అంటూ ఇంటికి పిలిచింది.. కట్ చేస్తే.. సీన్‌లోకి మరో నలుగురు

ఆమెకు 21, అతనికి 57 ఏళ్లు.. ముందే పరిచయం చేసుకుంది.. ఆ పరిచయం కాస్త.. క్లోజ్‌ గా మాట్లాడుకునే వరకు వెళ్లింది.. తరచూ ఫోన్ లో కూడా సంభాషించుకునేవారు.. ఈ క్రమంలోనే.. ముందు రచించిన ప్రణాళిక ప్రకారం.. అంకుల్ టీ తాగుదాం రండి అంటూ ఇంటికి పిలిచింది.. ఆ తర్వాత సీన్‌లోకి మరో నలుగురు ఎంటర్ అయ్యారు.. చివరకు ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకోండి..

ఆమెకు 21, అతనికి 57 ఏళ్లు.. టీ తాగుదాం రండి అంటూ ఇంటికి పిలిచింది.. కట్ చేస్తే.. సీన్‌లోకి మరో నలుగురు
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 20, 2025 | 10:26 AM

Share

ఆమె అందంగా ఉంటుంది.. కొందరితో జత కట్టి గలీజ్ పనులను ప్రారంభించింది.. ఈ క్రమంలోనే.. అంకుల్ అంటూ.. ఓ వ్యక్తిపై వలపు వల విసిరింది.. అంకుల్‌ టీ తాగుదాం.. మా ఇంటికి రండి.. అంటూ పిలిచింది.. ఆ తర్వాత ముందుగా అనుకున్న ప్రకారం.. ప్రణాళికను ప్రారంభించింది.. ఈ క్రమంలోనే కొందరు యువకులు అక్కడికి చేరుకుని బెదిరించడం ప్రారంభించారు.. ఇలా హనీట్రాప్‌ వలలో ఇరికించి.. రూ.5లక్షల వరకు దోచుకున్నారు.. అయితే.. వారిపై అనుమానం వచ్చి అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు బైదరహళ్లి చోటుచేసుకుంది..

57 ఏళ్ల సివిల్ కాంట్రాక్టర్‌ను హనీ ట్రాప్ చేసి 5 లక్షలకు పైగా విలువైన నగదు, విలువైన వస్తువులను దోపిడీ చేసిన ఆరోపణలపై బెంగళూరులోని బైదరహళ్లి పోలీసులు శనివారం ఒక యువతి (21) తో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను నయన, మోహన్, సంతోష్ అజయ్, జయరాజ్‌లుగా గుర్తించారు. వీళ్లంతా సివిల్ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేశారు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “సివిల్ కాంట్రాక్టర్ స్నేహితుడు ఆరు నెలల క్రితం అతనికి నయనను పరిచయం చేశాడు. కాంట్రాక్టర్‌తో సన్నిహితంగా మెలిగిన ఆమె తన కుమారుడికి వైద్యం చేయించేందుకు డబ్బులు అడిగింది. దీంతో సదరు కాంట్రాక్టర్ రూ.14వేలు బదిలీ చేశాడు. నయన కాంట్రాక్టర్‌ను పలు సందర్భాల్లో ఆహ్వానించినప్పటికీ, అతను ఆమె ఇంటిని సందర్శించలేదు.. కానీ వాళ్లిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు.

ఈ క్రమంలోనే.. డిసెంబర్ 9న ఆ మహిళ.. అంకుల్ టీ తాగుదాం రండి అంటూ.. సివిల్ కాంట్రాక్టర్‌ను తన నివాసానికి ఆహ్వానించింది. అతను వచ్చిన తర్వాత, ముందే వేసిన స్కెచ్ ప్రకారం.. నయన స్నేహితులు పోలీసుల వేషంలో కనిపించారు.. సివిల్ కాంట్రాక్టర్‌ ఆమెతో కలిసి వ్యభిచార రాకెట్ నడుపుతున్నాడని పేర్కొంటూ అరెస్టు చేయమని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు

ఆ సమయంలో కాంట్రాక్టర్ ధరించిన రూ.29 వేల నగదు, రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను నిందితులు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఏం తెలియనట్లు నయన అమాయకురాలిగా నటించింది. అదే రోజు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, కాంట్రాక్టర్ నయనను పిలిచి, తాను పోలీసు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.. తనకు సహకరించాలని కోరాడు. దీనిపై స్పందించిన నయన తన ఇంటికి వచ్చి తనతో సంబంధం ఉందని చెబుతానని బెదిరించినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె ముఠాలో భాగమని కాంట్రాక్టర్‌కు అర్థమైంది. అనంతరం కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..