బఠిండాలో ‘జాంబీ’లా యువతి..! నడవలేక రోడ్డుపైనే కుప్పకూలిన 19 ఏళ్ల యువతి.. వైరల్ వీడియో
పంజాబ్‌లోని బఠిండాలో యువతి మత్తులో ఉన్నట్లు వైరల్ వీడియో కలకలం రేపింది. ఈ ఘటన పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యపై చర్చను మళ్లీ లేవనెత్తింది. పోలీసులు వెంటనే స్పందించి యువతిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితికి అసలు కారణంపై ఇంకా స్పష్టత లేదు, అధికారికంగా డ్రగ్స్ నిర్ధారణ కాలేదు. ఇది పంజాబ్ యువత భవిష్యత్తుపై ఆందోళనలను పెంచుతోంది.

పంజాబ్‌లోని బఠిండాలో ఓ యువతి మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో చిత్రీకరించినట్లుగా చెబుతున్న ఈ వీడియోలో 19 ఏళ్ల యువతి నిలబడటానికి, నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ కనిపించింది. కొద్దిసేపటికే ఆమె సమతుల్యత కోల్పోయి కిందపడిపోగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యపై మరోసారి చర్చ మొదలైంది.
అయితే.. వైరల్ వీడియోలో కనిపిస్తున్న యువతి ఏదైనా డ్రగ్ తీసుకున్నట్లు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. సోషల్ మీడియాలో కొందరు ఈ ఘటనను ‘జాంబీ డ్రగ్’ వినియోగంతో ముడిపెడుతున్నప్పటికీ.. ఆమె వద్ద ఏలాంటి పదార్థం ఉందన్నది, ఆమె అసలు ఏ కారణంతో ఆ పరిస్థితిలోకి వెళ్లిందన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై శిరోమణి అకాలీదళ్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ స్పందించారు. వైరల్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్ చేసిన ఆయన.. పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యపై భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యువత, ముఖ్యంగా మహిళలు మాదకద్రవ్యాల ముప్పు నుంచి రక్షించబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ మాదకద్రవ్య వ్యతిరేక ప్రచారంపై కూడా బాదల్ విమర్శలు చేశారు.
Our daughters are Punjab’s future, strength and pride. If they are not safe from the drug menace, how will we secure Punjab’s future? The visuals coming from Bathinda grain market have shaken the conscience of Punjab. A young girl in such a pathetic condition, completely doped and behaving in a strange manner in a public place, is a horrifying reminder of how deeply the drug menace has penetrated our society.
Guru-Dokhi @BhagwantMann ’s government has failed to protect our youth. Despite all the slogans and publicity around Yudh Nasheyan Virudh, drugs continue to destroy lives and now even our daughters are being swallowed by this menace. Punjab needs freedom from drugs, not a government high on its own publicity.
— Sukhbir Singh Badal (@officeofssbadal) October 2, 2026
ఇదిలా ఉండగా.. వైరల్ వీడియోపై బఠిండా పోలీసులు స్పందించారు. కోత్వాలి బఠిండా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మత్తులో ఉన్నట్లు కనిపించిన వీడియోను సుమోటోగా స్వీకరించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పీసీఆర్ బృందం అక్కడికి చేరుకుని యువతిని సురక్షితంగా రక్షించింది. అనంతరం వైద్య సహాయం కోసం బఠిండా సివిల్ ఆసుపత్రికి తరలించింది.
🚨 Immediate Action on Social Media Video | Bathinda Police
A viral social media video regarding a girl found in an apparently intoxicated condition in the area of Police Station Kotwali Bathinda was taken cognizance of by Bathinda Police, following which immediate action was taken. The PCR team reached the spot, safely rescued the girl and admitted her to Civil Hospital, Bathinda.
During verification, it was found that the girl is a resident of Jaito, District Faridkot. Her family members were informed and called to the hospital. Further necessary legal action is being taken in the matter.
#BathindaPolice #PunjabPolice #DrugFreePunjab #ImmediateAction
— BATHINDA POLICE (@BathindaPolice) October 2, 2026
పోలీసుల విచారణలో ఆమె ఫరీద్‌కోట్ జిల్లాలోని జైటోకు చెందిన యువతిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆసుపత్రికి పిలిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. యువతి వైద్య పరిస్థితి, ఆమె మత్తులోకి వెళ్లడానికి గల అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
