Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నారదా కేసు చల్లారిపోయిందా? బెంగాల్ మంత్రులకు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ స్పెషల్ కోర్టు, బీజేపీపై నేతల ఫైర్

నారదా లంచం కేసులో బెంగాల్ మంత్రులు ఇద్దరికి , ఓ ఎమ్మెల్యేకి, కోల్ కతా మాజీ మేయర్ కి సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ,

నారదా కేసు చల్లారిపోయిందా? బెంగాల్ మంత్రులకు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ స్పెషల్ కోర్టు, బీజేపీపై నేతల ఫైర్
7
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 17, 2021 | 10:41 PM

నారదా లంచం కేసులో బెంగాల్ మంత్రులు ఇద్దరికి , ఓ ఎమ్మెల్యేకి, కోల్ కతా మాజీ మేయర్ కి సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్ర , ఈ పార్టీకి చెందిన మాజీ నేత సోవన్ ఛటర్జీలను ఈ ఉదయం వారి ఇళ్ల నుంచి అరెస్టు చేసి తమ కార్యాలయానికి తీసుకుపోయారు. సీఎం మమతా బెనర్జీకి ఈ విషయం తెలిసిన వెంటనే సీబీఐ కార్యాలయానికి వెళ్లి తమవారిని విడుదల చేయాలనీ, దమ్ముంటే తనను కూడా అరెస్టు చేయాలనీ సవాల్ విసిరారు. కొద్దిసేపు ధర్నా కూడా చేశారు. అటు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వందలాదిగా ఈ కార్యాలయం వద్దకు చేరుకొని కార్యాలయంపై రాళ్లు విసిరారు. తమ మంత్రులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా బీజేపీ కక్ష సాధింపుతో తమను అరెస్టు చేయించిందని మంత్రులు, ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి చెందిన బీజేపీ ఇలా పగ సాధించాలని చూసిందని, కానీ అది ఫలించలేదని వారన్నారు.

మరోవైపు-వీరి బెయిలును సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టుకెక్కే యోచన ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా కోల్ కతా నగరాన్ని నేడు జరిగిన ఘటనలు వరుసగా ఓ ఊపు ఊపాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ ముఖర్జీ తాము లీగల్ గానే వెళ్తామని ముందే హెచ్చరించారు.చట్టం తన పని తాను చేసుకుని పోతుందని వ్యాఖ్యానించారు.

మరిన్ని చదవండి  ఇక్కడ :  Prabhas Adipurush video : ప్రాణాలు రిస్క్‌లో పెట్టలేను డార్లింగ్‌.. ఆదిపురుష్ కు తప్పని కష్టాలు..నిర్మాతలను ఒప్పించినా ప్రభాస్ ..(వీడియో).

 Vijay Sethupathi video : పెరుగుతున్న క్రేజ్ విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఎంట్రీ ..కత్రినా కైఫ్ తో విజయ్ షూట్ పోస్టుపోన్..(వీడియో).

 Viral Video : సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన దివ్యాంగుడు.. చేతులు లేకుండానే యువకుడు చేస్తున్న కృషికి ఫిదా అవుతున్న నెటిజన్లు ఫిదా ..(వీడియో).