రాంగ్ రూట్ డ్రైవర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన లేడీ
రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ బస్సు డ్రైవర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఓ లేడీ. ఆ మహిళ ఇచ్చిన డోస్‌కు అంతపెద్ద బస్సుని కాస్త రూట్‌మార్చి తిప్పేశాడు సదరు బస్సు డ్రైవర్. ఆ మహిళ చేసిన సాహాసంతో అక్కడి స్థానికులు సైతం విస్తుపోయి చూడాల్సి వచ్చింది. కేరళలో ఓ మహిళ తన స్కూటీపై ప్రయాణిస్తూ..అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్తోంది. కానీ, ఆమెకు ఎదురుగా వచ్చిన ఓ బస్సు డ్రైవర్ మాత్రం రాంగ్‌రూట్‌లో వచ్చాడు. ఆ బస్సు […]
రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ బస్సు డ్రైవర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఓ లేడీ. ఆ మహిళ ఇచ్చిన డోస్‌కు అంతపెద్ద బస్సుని కాస్త రూట్‌మార్చి తిప్పేశాడు సదరు బస్సు డ్రైవర్. ఆ మహిళ చేసిన సాహాసంతో అక్కడి స్థానికులు సైతం విస్తుపోయి చూడాల్సి వచ్చింది. కేరళలో ఓ మహిళ తన స్కూటీపై ప్రయాణిస్తూ..అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్తోంది. కానీ, ఆమెకు ఎదురుగా వచ్చిన ఓ బస్సు డ్రైవర్ మాత్రం రాంగ్‌రూట్‌లో వచ్చాడు. ఆ బస్సు ఆమె స్కూటీకి అతి సమీపంగా వచ్చింది. అయినా కూడా ఆమె తన బండి వెనక్కి తిప్పలేదు. కాళు కిందపెట్టి అలాగే చూస్తూ నిలబడిపోయింది. బస్సు ముందుకు కదిలే పరిస్థితి లేదు..ఎందుకంటే..బస్సును మరికాస్త ముందుకు తీస్తే..ఆమెకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కొంత సమయం వరకు బస్సు డ్రైవర్ – స్కూటీపై లేడీ ఇద్దరూ ఉన్నచోట ఉన్నట్లుగానే స్తంభించిపోయారు. తానూ సరైన మార్గంలోనే వస్తున్నానని..బస్సు డ్రైవర్ మాత్రం లెఫ్ట్‌లో రాకుండా రైట్‌లో వచ్చి తనకు అడ్డుపడ్డాడు..కాబట్టి బస్సు డ్రైవరే తప్పుకోవాలన్నట్లుగా ఆ లేడీ సైలెంట్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో చేసేది లేక బస్సు డ్రైవర్ కాస్త రూట్ మార్చుకుని సరైన మార్గంలో వెళ్లిపోయాడు..ఇదంతా చూస్తున్న అక్కడి జనాలు, వాహనదారులు సైతం కిక్కురు మనకుండా ఉండిపోయారు..రోడ్డుపై జరిగిన సంఘటనను సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించిన కొందరు దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో…ఆ మహిళకు నెటిజన్ల నుండి ప్రశంసలు వెల్లువెతుత్తున్నాయి.