Ayodhya: రామమందిరంతో మారనున్న దేశ పర్యాటక ముఖ చిత్రం.. ఏటా 5 కోట్ల మంది..
ఇదిలా ఉంటే విగ్రహ ప్రతిష్ట రోజు కేవలం ప్రముఖులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇక జనవరి 23వ తేదీ నుంచి భక్తులందరికీ బాలరాముడి దర్శనం కల్పించనున్నారు. రామమందిర నిర్మాణంతో దేశ పర్యాటక ముఖ చిత్రం మారనుందని అంచనా...

దేశ ప్రజల చిరకాల స్వప్నమైన రామ మందిర కల సాకారమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరాడు. ఈ అద్భుత ఘట్టాన్ని ఒక్క భారతీయులే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా భక్తులు వీక్షించారు. 500 ఏళ్ల కల నిజమైన వేళ.. దేశమంతా రామనామంతో మారుమోగింది. ఊరువాడ అంతా యజ్ఞాలు, యాగాలు, ర్యాలీలతో హిందువులు హోరెత్తించారు.
ఇదిలా ఉంటే విగ్రహ ప్రతిష్ట రోజు కేవలం ప్రముఖులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇక జనవరి 23వ తేదీ నుంచి భక్తులందరికీ బాలరాముడి దర్శనం కల్పించనున్నారు. రామమందిర నిర్మాణంతో దేశ పర్యాటక ముఖ చిత్రం మారనుందని అంచనా వేస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ప్రతీ రోజూ సుమారు లక్ష నుంచి లక్షన్న వరకు భక్తులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ గ్రూప్ అంచనా వేసింది.
అయోధ్య దేశంలో నూతన పర్యాటక కేంద్రంగా మారనుందని పలు సంస్థలు భావిస్తున్నాయి. ఏటా అయోధ్యకు సుమారు 5 కోట్ల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని సంస్థలు చెబుతున్నారు. అయోధ్యలో అధునాతన హోటల్స్ అందుబాటులోకి రావడం, రోడ్డు వ్యవస్థ మెరుగుపడడం, రైల్వే స్టేషన్ పునరుద్ధరించడం, ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడంతో పర్యాటం పుంచుకోనుందని జెఫరీస్ తన నివేదికలో తెలిపింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రామాలయ నిర్మాణం 80 శాతం పూర్తికాగా ఇంకా కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. కేవలం ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా అయోధ్య నగరాన్ని మొత్తం పుననిర్మించారు. దీంతో అయోధ్య నగరం రూపురేఖలు కూడా మారిపోయాయి. యాత్రికుల పెరుగుదలతో పాటు, అనేక రంగాలు ఊపందుకోనున్నాయి. దేశ పర్యాటక రంగానికి అయోధ్య కొత్త మోడల్‌గా మారనుందని జెఫరీస్ వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




