అయోధ్యలో రామ మందిర్ ట్రస్ట్ నిధులు ‘గోవిందా’ !

అయోధ్యలో రామ మందిర్ ట్రస్ట్ కు చెందిన లక్షలాది నిధులను ఎవరో వ్యక్తులు మోసపూరితంగా రెండు బ్యాంకు అకౌంట్ల నుంచి విత్ డ్రా చేశారు. ఫోర్జరీ చేసిన చెక్కులను వినియోగించి వారీ మోసానికి పాల్పడ్డారని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కి తెలిసింది.

అయోధ్యలో రామ మందిర్ ట్రస్ట్ నిధులు 'గోవిందా' !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 10, 2020 | 10:27 AM

అయోధ్యలో రామ మందిర్ ట్రస్ట్ కు చెందిన లక్షలాది నిధులను ఎవరో వ్యక్తులు మోసపూరితంగా రెండు బ్యాంకు అకౌంట్ల నుంచి విత్ డ్రా చేశారు. ఫోర్జరీ చేసిన చెక్కులను వినియోగించి వారీ మోసానికి పాల్పడ్డారని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కి తెలిసింది. మూడో సారి కూడా ఆ కేటుగాళ్లు ఇలా అక్రమంగా ‘దేవుడి సొమ్మును’ కాజేయబోగా అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ ‘అడ్డుపడింది.’, చంపత్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ట్రస్ట్ సభ్యులు  బ్యాంకుల్లో తాము రామ మందిర్ పేరిట డిపాజిట్ చేసిన సొమ్ము పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే.