Ayodhya: నేడు బాల రాముడి పట్టాభిషేకం.. దేశమంతా రామ నామ జపం.. మేము రాం రాం అంటున్న ఖర్గే, సోనియా సహా పలువురి నేతలు

ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్‌ బాట పట్టాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని తృణమూల్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ట జరిగేవేళ తాను బెంగాల్‌లోని ఆలయాలు, మసీదులు, చర్చీలను సందర్శిస్తానన్నారు ఆమె. ఇక ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా బాల రామయ్య ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం లేదని తేల్చేశారు. అయితే ప్రతిష్ట తర్వాత కుటుంబ సమేతంగా అయోధ్య వెళతానన్నారు ఆయన.

Ayodhya: నేడు బాల రాముడి పట్టాభిషేకం.. దేశమంతా రామ నామ జపం.. మేము రాం రాం అంటున్న ఖర్గే, సోనియా సహా పలువురి నేతలు
Ayodhya Boycott Leaders
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2024 | 6:41 AM

కోట్లాది మంది హిందువుల కల తీరే సమయం ఆసన్నం అయింది. మరికొన్ని క్షణాల్లో రామ మందిర గర్భ గుడిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయితే అయోధ్య మాత్రం వెళ్లం అంటున్నారు ఇండియా కూటమి నేతలు. అది సోనియా, రాహుల్‌, ఖర్గే మాట మాత్రమే కాదు…మమత, కేజ్రీవాల్‌ బాట కూడా. ఎందుకంటే ఇది బీజేపీ పండుగంట, అంతా రాజకీయమంట అనేది వాళ్ల ఆరోపణ. అందుకే బాయ్‌కాట్‌ అంటున్నామన్నారు ఇండీ నేతలు.

అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్టతో దేశమంతా పండుగ జరుపుకుంటోంది. ఇది అయోధ్యకు మాత్రమే కాదు…దేశం మొత్తానికి దివ్య దీపావళిలా ప్రజలు భావిస్తున్నారు. అయితే ఇది పొలిటికల్‌గా మాత్రం విభేదాలు రేపుతోంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు వెళ్లబోమంటున్నారు ఇండియా కూటమి నేతలు. ఎందుకంటే ఇది బీజేపీ పండుగంటున్నారు వాళ్లు. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తమ పార్టీ నేతలు హాజరుకావడం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని సోనియాగాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌదరికి ఆహ్వానాలు అందాయి. అయితే అయోధ్య పేరుతో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయాలు చేశాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. అందుకే ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించింది. అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని కాంగ్రెస్‌ విమర్శించింది. మతం అనేది వ్యక్తిగత అంశం అని కాంగ్రెస్‌ పేర్కొంది.

రామమందిరం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ ఇటీవల స్పందించారు. అది ప్రధాని మోదీ చేపట్టిన రాజకీయ కార్యక్రమం అని, ఓట్ల కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న పొలిటికల్‌ ఫంక్షన్‌ కాబట్టే దానికి తాము హాజరు కావట్లేదన్నారు ఆయన. తమ పార్టీ నేతలు అయోధ్యకు వెళితే అభ్యంతరం చెప్పబోమన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్‌ బాట పట్టాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని తృణమూల్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ట జరిగేవేళ తాను బెంగాల్‌లోని ఆలయాలు, మసీదులు, చర్చీలను సందర్శిస్తానన్నారు ఆమె. ఇక ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా బాల రామయ్య ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం లేదని తేల్చేశారు. అయితే ప్రతిష్ట తర్వాత కుటుంబ సమేతంగా అయోధ్య వెళతానన్నారు ఆయన. మరోవైపు మరాఠా స్ట్రాంగ్‌మేన్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌..పనుల ఒత్తిడితో ఈ కార్యక్రమానికి వెళ్లట్లేదన్నారు. 22వ తేదీ తర్వాతే అయోధ్యను సందర్శిస్తానన్నారు ఆయన. ఇక ఎస్పీ అధినేత అఖిలేష్‌, ఆర్జేడీ నేతలు లాలూ, తేజస్వీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదని చెప్పేశారు. మొత్తంమీద రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇండియా కూటమి దూరంగా జరిగింది.

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను దేశమంతా పండుగలా జరుపుకుంటుంటే కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి నేతలు బాయ్‌కాట్‌ చేయడం, రాజకీయంగా చర్చనీయాంశమైంది

మరిన్నిజాతీయ  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే