Gold Price Today: అలర్ట్.. బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే..

Gold Price Today: అలర్ట్.. బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 22, 2024 | 6:26 AM

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (జనవరి 22) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,050 గా ఉంది. వెండి కిలో ధర రూ. 75,500 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,200 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.58,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,250, 24 క్యారెట్ల ధర రూ.63,550, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,050 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,500 గా ఉంది. ముంబైలో రూ.75,500, చెన్నైలో రూ.77,000, బెంగళూరులో రూ.73,000 ఉంది. కేరళలో రూ.77,000, కోల్‌కతాలో రూ.75,500 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,000, విజయవాడలో రూ.77,000, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,000 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..