AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM: ఏటీయంలో డబ్బులు వేయడానికి వ్యాన్‌లో వచ్చిన సిబ్బంది..ఇంతలోనే డబ్బులతో పరారైన డ్రైవర్

ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన సొమ్మును ఓ వ్యాన్ డ్రైవర్ ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే బిహార్‌లోని పాట్నలో ఓ సెక్యూర్ వాల్యూ ఇండియా కంపెనీలో సురజ్ కుమార్ అనే వ్యక్తి వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

ATM: ఏటీయంలో డబ్బులు వేయడానికి వ్యాన్‌లో వచ్చిన సిబ్బంది..ఇంతలోనే డబ్బులతో పరారైన డ్రైవర్
Atm Van
Aravind B
|

Updated on: Apr 12, 2023 | 6:55 AM

Share

ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన సొమ్మును ఓ వ్యాన్ డ్రైవర్ ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే బిహార్‌లోని పాట్నలో ఓ సెక్యూర్ వాల్యూ ఇండియా కంపెనీలో సురజ్ కుమార్ అనే వ్యక్తి వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈ కంపెనీకి చెందిన సిబ్బందితో పాటు ఆ డ్రైవర్ డంకా ఎమ్లీ గోలంబార్ సమీపంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీయం వద్దకు వ్యాన్ లో చేరుకున్నారు. ఆ సమయంలో వ్యాన్ లోని డ్రైవర్ తో పాటు ఓ గన్‌మెన్, సంస్థ ఆడిటర్ ఉన్నారు. మరి ముఖ్యంగా అందులో రూ.1.5 కోట్ల నగదు ఉంది.

అయితే ఏటీఎంలో డబ్బులు వేసేందుకు వాళ్లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పార్కింక్ సమస్య ఉండటంతో ఆ వ్యాన్‌లో ఉన్న ఆడిటర్, గన్‌మెన్ వాహనం దిగి కొద్ది దూరం వెళ్లారు. దీంతో ఇదే సమయమని భావించిన డ్రైవర్ రూ.1.5 కోట్లతో వ్యాన్‌లో పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ కంపెనీ ఆడిర్, గన్‌మెన్ లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ తర్వాత వ్యాన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే డబ్బులతో పరారైన డ్రైవర్ సురజ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. .

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి